బాక్సాఫీస్ రిపోర్ట్ : 4 రోజుల్లో “పఠాన్” కి మైండ్ బ్లోయింగ్ వసూళ్లు.!

బాలీవుడ్ సినిమా ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ మాసివ్ భారీ కం బ్యాక్ చిత్రం “పఠాన్” రూపం లో వచ్చేసింది. హీరో షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రం మొదటి రోజే ఊహించని స్థాయి వసూళ్లు నమోదు చేయగా ఇంకా మైండ్ బ్లాకింగ్ గా ఇదే వసూళ్ల హవా నెక్స్ట్ రోజుల్లో కూడా ఈ చిత్రం అందుకుంటుంది.

ముఖ్యంగా ఈ చిత్రం ప్రతి రోజు కూడా 100 కోట్ల గ్రాస్ కి తగ్గకుండా వస్తుండగా నిన్న మూడు రోజుల్లో కూడా ఏకంగా 313 కోట్ల భారీ గ్రాస్ ని ఈ చిత్రాన్ని అందుకుంది. అయితే ఇక నాలుగవ రోజు కూడా అనుకున్నట్టుగా భారీ వసూళ్లతో శుక్రవారం కన్నా ఎక్కువ జంప్ తీసుకొని 20 కోట్లు ఎక్కువే వసూలు చేసింది.

దీనితో ఈ భారీ సినిమా హిందీలో ఈ నాలుగు రోజుల్లో 210 కోట్లు కొల్లగొట్టి 210 కోట్ల గ్రాసర్ గా నిలిచి ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అయితే ఈ చిత్రం నాలుగు రోజుల్లో టోటల్ గా 429 కోట్ల మాసివ్ గ్రాస్ ని ఈ సినిమా అందుకుంది. అయితే ఇందులో సగం ఓవర్సీస్ మార్కెట్ నుంచే ఈ చిత్రానికి రావడం విశేషం.

యూఎస్ సహా ఇతర దేశాల్లో పఠాన్ కి మైండ్ బ్లోయింగ్ వసూళ్లు రిజిస్టర్ అవుతున్నాయి. కాగా ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రం ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డులు బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. దీనితో ఈ భారీ సినిమా ఈరోజు ఆదివారంతో సునాయాసంగా 500 కోట్ల వసూళ్లు దాటేస్తుంది అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించగా జాన్ అబ్రహం విలన్ గా నటించాడు.