ఇండస్ట్రీ టాక్ : “కల్కి” రిలీజ్ డేట్ ఖరారైందా??

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన గత చిత్రం “సలార్ సీజ్ ఫైర్” తో తాను ఫైనల్ గా మళ్ళీ బాక్సాఫీస్ హిట్ ని స్కోర్ చేసి తన కెరీర్ లో అయితే మరో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. కాగా దీనితో ఇక తన తదుపరి సినిమాలపై నెక్స్ట్ లెవెల్ హైప్ స్టార్ట్ కాగా ఈ చిత్రాల్లో యంగ్ దర్శకుడు నాగశ్విన్ తో చేస్తున్న చిత్రం “కల్కి 2898ఏడి” కూడా ఒకటి.

మరి ఈ సినిమాని పాన్ వరల్డ్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తుండగా ఒకో అప్డేట్ ఈ సినిమా విషయంలో మరిన్ని అంచనాలు పెంచుతుంది. ఇక మరి ఫైనల్ గా అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇండస్ట్రీ వర్గాల్లో క్రేజీ న్యూస్ ఇప్పుడు వినిపిస్తుంది. దీనితో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది ఈ వారం రోజుల్లో ఓ బిగ్ అప్డేట్ రాబోతుంది అని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఈ అప్డేట్ విషయంలో వినిపిస్తున్న మరికొన్ని రూమర్స్ ప్రకారం ఈ ఏడాదిలో మే 9న థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా దిగబోతున్నట్టుగా సెన్సేషనల్ రూమర్ వినిపిస్తుంది. దీనితో ఈ సినిమా రావడానికి ఎంతో సమయం లేదనే చెప్పాలి. కాగా ఈ అంశంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ చిత్రంలో ఉలగనయగన్ కమల్ హాసన్ విలన్ పాత్రలో నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ అలాగే హీరోయిన్ దీపికా పదుకొనె ముఖ్య పాత్రలు చేస్తున్నారు. అలాగే ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.