“కల్కి 2898ఎడి” ఆరోజే ఎందుకంటే.. 

ఈ ఏడాదిలో రాబోతున్న పలు మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రాల్లో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె అలాగే దిశా పటాని లాంటి బాలీవుడ్ హీరోయిన్స్ ముఖ్య పాత్రల్లో అలాగే ఉలగనయగన్ కమల్ హాసన్ మరియు బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లు నటిస్తున్న సెన్సేషనల్ వరల్డ్ క్లాస్ చిత్రం “కల్కి 2898ఎడి” కూడా ఒకటి.

కాగా ఈ చిత్రానికి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఈ సంక్రాంతి లోనే విడుదల కావాల్సింది కానీ మేకర్స్ పలు కర్మలు రీత్యా ఈ రేస్ లో తప్పుకున్నారు. కాగా ఈ భారీ చిత్రం విడుదల ఎప్పుడు అనేది మేకర్స్ క్రేజీ హింట్ అండ్ అప్డేట్ ఇవాళ ఇచ్చారు.

అయితే దీనిని పక్కన పెడితే దీని కన్నా ముందే సినిమా రిలీజ్ డేట్ పై గాసిప్ బయటకి వచ్చింది. కాగా దీనితో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈ రానున్న మే 9న బ్రహ్మాండమైన విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేసారని వచ్చింది. కాగా ఈ డేట్ లోనే ఎందుకు అంటే.. దానికి ఓ సెంటిమెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

అదేమిటంటే ఈ సినిమా నిర్మాత సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన చిత్రాలు జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంకా మహానటి లాంటి సినిమాలు అదే మే 9న విడుదల అయ్యి సంచలన విజయాలు సాధించాయి. అందుకే అదే తేదీని సెంటిమెంట్ గా “కల్కి 2898ఎడి” చిత్రం రిలీజ్ కి కూడా ఖాయం చేసారని భోగట్టా. ఈ కారణం చేత మాత్రమే ఈ సినిమా ఈ ఏడాదిలో రాబోతుంది అని వినికిడి. కాగా ఈ అంశంపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది..