ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే ఇప్పుడు పవర్ఫుల్ పొలిటికల్ లీడర్!

తెలుగు సినిమా పరిశ్రమ తెలుగు వాళ్ళనే కాకుండా టాలెంట్ ఉన్న ప్రతీ పర భాష నటి నటులను కూడా ఆదరిస్తుంది. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, బెంగాలీ ఇలా ఎన్నో రకాల భాషలకు చెందిన హీరోయిన్లు తమ అదృష్టాన్ని టాలీవుడ్ లో వెతుక్కుంటూ ఉంటారు అలాగే హీరోయిన్ రచన బెనర్జీ కూడా బెంగాలీ నుంచి వచ్చి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తన అందం అభినయంతో ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న ఈ నటి చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.

పిల్ల నచ్చింది, కన్యాదానం, పవిత్ర ప్రేమ, సుల్తాన్, రాయుడు, మామిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాలలో నటించిన రచన బావగారు బాగున్నారా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అయితే లాహిరి లాహిరి లాహిరిలో సినిమా తెలుగులో ఆమెకి ఆఖరి చిత్రం కావటం గమనార్హం. సడన్ గా టాలీవుడ్ నుంచి మాయమైపోయి సొంత రాష్ట్రానికి వెళ్లిపోయి అక్కడ సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది.

తర్వాత పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి తల్లిగా కూడా మారిన తరువాత మరింత బిజీ అయిపోయింది ఈ భామ. రియాలిటీ షోలు, టీవీ షోస్ చేస్తూ బెంగాలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. దీదీ నెంబర్ వన్ అనే టీవీ షో తో మంచి గుర్తింపుని తెచ్చుకున్న రచన సీఎం మమతా బెనర్జీ సమక్షంలో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరింది వెంటనే లోక్సభ ఎన్నికల్లో హుబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగింది.

తన పాపులారిటీతో ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అయిన లాకెట్ చటర్జీ పై ఏకంగా 70 వేల ఓట్ల మెజారిటీతో ఓడించింది ప్రస్తుతం ఎంపీగా ప్రజా సేవలో బిజీగా ఉంది రచన బెనర్జీ. మామూలుగా హీరోయిన్స్ పెళ్లి అయితే కెరీర్ స్లో అవుతుంది అయితే రచన విషయంలో మాత్రం అది రివర్స్ అయింది. పెళ్లి తర్వాత ఆమె కెరియర్ ఒక రేంజ్ లో దూసుకుపోయింది అంతేకాదు రాజకీయంగా కూడా ఆమె మంచి స్థాయిలో ఉండడం గమనార్హం.