తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీని అభిమానించే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మెగా అభిమానులు పవన్, రామ్ చరణ్ లకు అభిమానులుగా మారిపోయారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని గెలిపించడానికి కూడా అభిమానులు ఎంతగానో కృషి చేశారు. అయితే వైఎస్సార్ హవా ఉన్న సమయంలో చిరంజీవి చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.
అయితే పవన్ ను ప్రజలు రాజకీయ నేతలా చూడటం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినీ హీరోగా పవన్ కళ్యాణ్ ను అభిమానించిన వాళ్లే పవన్ కళ్యాణ్ లో పూర్తిస్థాయిలో రాజకీయ పరిజ్ఞానం లేదని కామెంట్లను వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. పవన్ ను ప్రజలు రాజకీయ నేతలా చూడటం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రజల హృదయాలకు దగ్గరవడంలో ఫెయిల్ అయ్యారని చాలామంది చెబుతున్నారు.
తాజాగా జరిగిన ఘటన వల్ల తెలంగాణలో షర్మిలకు మైలేజ్ పెరగగా పవన్ పార్టీ పెట్టి తొమ్మిదేళ్లు అవుతున్నా ఆయన ఈ స్థాయిలో మైలేజ్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ సినిమాలలో నటిస్తుండటం వల్లే పూర్తిస్థాయి రాజకీయ నేతగా గుర్తింపును సంపాదించుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల నుంచి వచ్చే విమర్శలను పరిగణనలోకి తీసుకున్నా పవన్ కళ్యాణ్ పార్టీ పరిస్థితి మారేదని చాలామంది చెబుతున్నారు. వైసిపీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునే విషయంలో టీడీపీ, జనసేన ఫెయిల్ అవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు పార్టీలు రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని ఆ పార్టీల అభిమానులు కోరుకుంటున్నా అందుకు భిన్నంగా జరుగుతుండటం గమనార్హం.