ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఒకప్పటి న్యూస్ రీడరని తెలుసా!

టాలీవుడ్ లో చాలా మంది ఇతరభాషల నుంచి వచ్చిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇతర బాషల నుంచి వచ్చినప్పటికీ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించి వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. వీరిలో సినిమా పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినవారు ఉన్నారు. ఇందు స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హీరోయిన్గా ఎదిగిన వారు ఉన్నారు. ప్రస్తుతం స్టార్ హోదా లో ఉన్న ప్రియా భవాని శంకర్ కూడా అలా కింది స్థాయి నుంచి వచ్చినదే.

న్యూస్ యాంక‌ర్‌గా, సీరియ‌ల్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొద‌లుపెట్టి ఆపై హీరోయిన్‌గా మారింది ప్రియా భ‌వానీ శంక‌ర్‌. చిన్న సినిమాల‌తో ప్ర‌తిభ‌ను చాటుకొని ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్ వంటి దిగ్గ‌జ న‌టుడితో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. మొదట్లో న్యూస్ రీడర్‌గా పనిచేసిన ఆమె.. ఆ తర్వాత దో కాదల్ హై సీరియల్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాకు సినిమా ఆఫర్స్ క్యూ కట్టాయి.

2017లో మియాద‌మ‌న్ అనే త‌మిళ సినిమాతో హీరోయిన్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా భ‌వానీ శంక‌ర్ బ్యాట్ టూ బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్‌ను సొంతం చేసుకున్న‌ది. తర్వాత కడకుట్టి సింగం, రాక్షసుడు, మాఫియా, జడాలి సనంధోమ్ వంటి చిత్రాల్లో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు భాషలోనూ పలు సినిమాల్లో నటించింది.తమిళంలో వరుస సినిమాల్లో నటించిన ప్రియా.. తిరు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ధనుష్ నటించిన ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషించింది.

యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నాగచైతన్య నటించిన ధూత వెబ్ సిరీస్ లో నటించింది. గోపిచంద్ కి జోడిగా భీమా సినిమాలో మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి ఇక పెళ్లి విషయానికి వస్తే తాను రాజ్ అనే వ్యక్తితో పదేళ్ల నుంచి ఈ ప్రేమలో ఉన్నానని త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చింది ఈ భామ.