ఇలాగైతే ‘ఆచార్య’లో ఏమీ మిగలదు ?

Megastar's Acharya affected with leaks

 

Megastar's Acharya affected with leaks

మెగాస్టార్‌ చిరంజీవి, సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాను మొదటి నుండి లీక్స్ సమస్య వెంటాడుతూనే ఉంది. కొన్ని చిరంజీవిగారి నోటి ద్వారానే బయటకురాగా ఇంకొన్ని సెట్లో ఫోటోలు తీస్తున్నవారి ద్వారా బయటికొస్తున్నాయి. సినిమా టైటిల్ ‘ఆచార్య’ అని చిరుని స్టేజి మీద చెప్పేశారు. అక్కడి నుండి మొదలైన లీకుల పర్వం కొనసాగుతూనే ఉంది. చరణ్ గెటప్ విషయంలో ఈ లీక్స్ చాలా సమస్య సృష్టించాయి. సినిమాలో చెర్రీ ఎలా ఉండబోతున్నాడు అనేది ఈ లీక్స్ ద్వారా చూచాయిగా తెలిసిపోయింది.

ఇక తాజాగా సినిమాలోని ఒక కీలక సన్నివేశం తాలూకు ఫోటోలు బయటికొచ్చాయి. అందుకాలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్ వేషధారణలో కనిపిస్తున్నారు. పైగా చిరు మొన్ననే నా కామ్రేడ్ సిద్ద అంటూ చరణ్ పాత్రను ప్రస్తావించారు. సినిమాలో రెడ్ ఫ్లేవర్ చాలా చోట్ల కనిపించింది. వీటన్నింటినీ బట్టి కథలో చరణ్, చిరులు నక్సలైట్ పాత్రల్లో కనిపిస్తారని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు క్వారీ సెటప్లో పెద్ద ఫైట్ కూడ ఉంటుందని ఆ ఫోటో చూడగానే తెలిసిపోతోంది. సినిమా చూసేటప్పుడు ఒక్కొక్కటిగా రివీల్ అవుతూ ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వాల్సిన ఇలాంటి ముఖ్యమైన మసాలాలు ముందే లీక్స్ ద్వారా బయటికి రావడం ఆడియన్స్ మీద తప్పకుండా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తేరుకుని మెగాస్టార్ టీమ్ కొంచెం అప్రమత్తత వహించడం మంచిది.