Home News మాస్టర్ : మా సినిమా లో సీన్ లు లీక్ చేశావ్ , పాతిక కోట్లు...

మాస్టర్ : మా సినిమా లో సీన్ లు లీక్ చేశావ్ , పాతిక కోట్లు కట్టు…!

మాస్టర్.. కోలీవుడ్ స్టార్ హీరో నటించిన పాన్ ఇండియన్ సినిమా. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకుల ముదుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అన్న టాక్ ని తెచ్చుకొని సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. వరసగా సక్సస్ లతో కోలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ స్టార్ గా మారిన విజయ్ .. తాజా చిత్రం మాస్టర్ తో కోలీవుడ్ ఫస్ట్ పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు. అయితే ఈ సినిమా రిలీజ్ ముందు కొన్ని కీలక సన్నివేశాలు లీకై చిత్ర యూనిట్ ని ఇబ్బంది పెట్టాయి.

Master Poster Twitter Dirlokesh 938579 1610540585 | Telugu Rajyam

ఇక సినిమా కూడా పాన్ ఇండియన్ స్థాయి లో రూపొందించిన సినిమా .. రిలీజ్ కి ముందే సీన్స్ లీకైతే నిర్మాత ఎలాంటి టెన్షన్ కి గురౌవుతాడో ఇంతకుముందు పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా అనుభవం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించిన నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఇలాంటి అనుభవాలే ఆ తర్వాత కూడా రిపీటయ్యాయి. కాగా ఇప్పుడు అదే అనుభవం మాస్టర్ నిర్మాతలకు ఎదురైంది.

మాస్టర్ సినిమా సంక్రాంతి బరిలో రిలీజవుతున్న సమయంలో వీడియో క్లిప్పింగ్స్ ద్వారా కొన్ని కీలక సీన్స్ లీకయ్యాయి. దాంతో నిర్మాత లు విపరీతమైన టెన్షన్ కి గురయ్యారు. ఇలాంటి లీక్ ల వల్ల నిర్మాతల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. కీలకమైన ఫుటేజీని చట్టవిరుద్ధంగా లీక్ చేయడం ద్వారా నష్టం కలుగుతుందన్న భయం, బెంగ ఎవరికీ ఉండదు. మాస్టర్ లీక్స్ కి ఇలాంటి వాళ్లే కారణం. మాస్టర్ సినిమా ఓవర్సీస్ రిలీజ్ ల కోసం డిజిటల్ ప్రింటస్ ను విదేశాలకు పంపినందుకు మేకర్స్ ఒక ప్రైవేట్ డిజిటల్ కంపెనీకి ఫుటేజ్ అందించారు.

Thalapathy Vijay Vijay Sethupathi Starrer Master Tops The Global Box Office 001 | Telugu Rajyam

ఆ సంస్థకు చెందిన ఒక ఉద్యోగి ఈ చిత్రం థియేటర్లలోకి రాకముందే మాస్టర్ నుండి సీన్స్ ను లీక్ చేశాడు. దీంతో నిర్మాతలకు విపరీతంగా టెన్షన్ పడ్డారు. ఎట్టకేలకు లీకులకు కారకుడిపై మాస్టర్ సినిమా నిర్మాతలు కేసు పెట్టాలనుకుంటున్నారట. ఫుటేజీని లీక్ చేసిన ఉద్యోగిపైనా నష్ట పరిహారం కింద రూ 25 కోట్లు దావా వేస్తున్నారట. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆ డిజిటల్ సంస్థకు .. లీకులకు కారకుడైన వ్యక్తికి లీగల్ నోటీసు పంపారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.

 

- Advertisement -

Related Posts

Nikki Galrani Gorgeous Pics

Nikki Galrani ,Nikki Galrani Gorgeous Pics ,Tamil Most popular Actress Nikki Galrani Gorgeous Pics,Actress Kollywood Nikki Galrani Gorgeous Pics Shooting spotphotos,Nikki Galrani ,Nikki Galrani...

Catherine Tresa Yellow Dress Photos

Catherine Tresa,Catherine Tresa Yellow Dress Photos,Tamil Most popular Actress Catherine Tresa Yellow Dress Photos,Actress Kollywood Catherine Tresa Yellow Dress Photos Shooting spotphotos,CatherineTresa,Catherine Tresa Yellow Dress...

నిర్మాత‌ల‌కు క‌ళ్ళు బైర్లు క‌మ్మిస్తున్న ఉప్పెన బ్యూటీ..!

ఒక్క సినిమాతో త‌న రాత‌నే మార్చుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఈ అమ్మ‌డి సొంతం. తెలుగు అమ్మాయి కాక‌పోయిన ప‌నిపై శ్ర‌ద్ధ‌తో కొద్ది రోజుల‌లో తెలుగు...

మంచు ల‌క్ష్మీ మెచ్చిన మీమ్.. సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్

సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగాక మీమ్స్ తో అనేక ఫ‌న్నీ జోక్స్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్ర‌హ్మానందంతో క్రియేట్ చేసే మీమ్స్ సామాజిక మాధ్య‌మాల‌లో తెగ హ‌ల్‌చ‌ల్ చేయ‌డ‌మే కాక, ఫుల్ వైర‌ల్...

Latest News