లేటెస్ట్ : “యష్ 19” టైటిల్ లాంచ్ పై బిగ్ అప్డేట్.. 

ఏ హీరోస్ కి అయినా కూడా తమ కెరీర్ లో ఒక పాత్ బ్రేకింగ్ చిత్రం తప్పకుండా ఉంటుంది. మరి అలా పాన్ ఇండియా లెవెల్లో కేజీఎఫ్ అనే చిత్రాలతో భారీ క్రేజ్ ని కన్నడ నటుడు యష్ అయితే దక్కించుకున్నాడు. తన గత చిత్రం వచ్చి ఏడాదిన్నర దాటేసింది కూడా అయినా కూడా ఇంకా తన నెక్స్ట్ సినిమా ఏది అనేది ఇంకా ఫిక్స్ కాలేదు.

దీనితో ఫ్యాన్స్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా తన తదుపరి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దీనిని కన్నడ నిర్మాణ సంస్థ కే వి ఎన్ వారు నిర్మాణం వహిస్తున్నట్టుగా ఆల్రెడీ తెల్సిందే. కాగా ఈ డిసెంబర్ 8న అయితే ఆ భారీ సినిమా టైటిల్ ని రివీల్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

మరి ఇపుడు ఆ ఎగ్జైట్మెంట్ ని పెంచుతూ ఈ టైటిల్ రిలీజ్ సమయాన్ని కూడా చెప్పారు. రేపు ఉదయం 9 గంటల 55 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ఫిక్స్ చేశారు. మరి ఈ టైటిల్ అయితే కేవలం సింగిల్ వర్డ్ లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి చూడాలి యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఎలాంటి సినిమాని అనౌన్స్ చేస్తారో అనేది. మెయిన్ గా కేజీఎఫ్ హైప్ ని యష్ మ్యాచ్ చేసే సినిమా అనౌన్స్ చేస్తాడా చేయడా అని చాలా మందిలో ఉన్న అనుమానం మరి దానిని యష్ ఎలా బ్రేక్ చేస్తాడో చూడాలి.