షాకింగ్ : “సలార్” లో ప్రభాస్ కి కేవలం ఇన్ని నిమిషాల డైలాగ్స్ మాత్రమే 

ఇండియన్ సినిమా దగ్గర గత ఏడాది వచ్చిన చివరి బాక్సాఫీస్ హిట్ చిత్రాల్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం “సలార్” కూడా ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా ప్రశాంత్ నీల్ కెరీర్ లో కూడా మాసివ్ హిట్ అయ్యింది.

కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి చూసాక ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కొన్ని అంశాల్లో చాలా డిజప్పాయింట్ అయ్యారు. మరి ఈ అంశాల్లో ప్రభాస్ కి సినిమాలో చాలా తక్కువ సేపు స్క్రీన్ టైం ఉంది అనేది కటి అయితే మరొకటి ఉన్న ఆ తక్కువ సేపులో కూడా ప్రభాస్ నోటి నుంచి వచ్చే డైలాగ్స్ కోసం కూడా ఇప్పుడు చర్చగా మారింది.

కాగా ప్రభాస్ స్క్రీన్ టైం సలార్ పార్ట్ 1 లో కేవలం 55 నిమిషాలు మాత్రమే ఉంటే ఈ 55 నిమిషాల్లో కూడా తనకి ఎంతసేపు డైలాగ్స్ ఉన్నాయో తెలుసా? కేవలం 2 నిమిషాల 55 సెకండ్లు అంట. ఇది ఒకింత షాకింగ్ అని చెప్పాలి. నిన్ననే సినిమా ఓటిటిలో విడుదల కాగా ఫ్యాన్స్ కూడా ఈ అంశాన్ని అబ్జర్వ్ చేసారు.

దీనితో మరీ ఇంత తక్కువా అని తల కొట్టుకుంటున్నారు. అలాగే నీల్ మాత్రం ఈ విషయంలో మరోసారి డిజప్పాయింట్ చేసాడని కొందరు అభిప్రాయం పడుతుంటే ఇంత తక్కువలో కూడా ప్రశాంత్ నీల్ ఒక అదిరిపోయే సినిమా తీసినందుకు మెచ్చుకోవాలి అని మూవీ లవర్స్ అంటున్నారు.