ఓటిటి : “సలార్” ఇంటర్నేషనల్ వెర్షనే ముందు ఇందుకేనా?

గత ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఏక్షన్ డ్రామా “సలార్ సీజ్ ఫైర్” కూడా ఒకటి. ఇయర్ కి ఎండింగ్ గా వచ్చిన ఈ చిత్రం బ్లాస్టింగ్ హిట్ అయ్యింది. కాగా ఈ భారీ చిత్రం నెల లోపే ఓటిటిలో రిలీజ్ కి రాగా నెట్ ఫ్లిక్స్ లో అయితే ఈ చిత్రం ముందుగా సౌత్ ఇండియా భాషలలో రిలీజ్ కి వచ్చింది.

అయితే తర్వాత ఈ సినిమా నేషనల్ లెవెల్లో హిందీ దానితో పాటుగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో కూడా వస్తుంది అని కన్ఫర్మ్ చేశారు. అయితే మాములుగా నెట్ ఫ్లిక్స్ లో చాలా వరకు సిన్మాలు మొదట హిందీలో వచ్చిన తర్వాతే ఇంగ్లీష్ వెర్షన్ లో రిలీజ్ అవుతాయి. కానీ సలార్ అందుకు భిన్నంగా ముందు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో ఈ చిత్రం ఓటిటిలో వచ్చేసింది.

అలాగే ఇంగ్లీష్ వెర్షన్ లో ఈ చిత్రం మరింత రెస్పాన్స్ ని అందుకుంటుంది. అయితే సలార్ సౌత్ భాషలు వెర్షన్ వచ్చినపుడే చాలా మంది ఫారిన్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో అందుకే సినిమా ఇంగ్లీష్ వెర్షన్ నే ముందు రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసి ఉండొచ్చు.

దీనితో హిందీ కన్నా ముందే చేస్తే మరింత మందికి ఈ సినిమా రీచ్ అవుతుంది అని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసాడేమో. అసలే తాను ఈ సినిమా కంటెంట్ “ఉగ్రం” చాలా మందికి రీచ్ అవ్వాల్సింది అని తనకి పర్శనల్ గా ఈ కథ ఇష్టం కాబట్టి సలార్ గా రీమేక్ చేసానని చెప్పాడు. దీనితో ఇందుకే సలార్ హిందీ కన్నా ఇంగ్లీష్ వెర్షన్ లోనే ముందు వచ్చి ఉండొచ్చు.