ఇన్సైడ్ టాక్ : “సలార్” హిందీ, ఇంగ్లీష్ రిలీజ్ అప్పుడా?

ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం సలార్ సీజ్ ఫైర్ తో బాక్సాఫీస్ హీటెక్కింది. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం గత ఏడాదికి అయితే హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ అవైటెడ్ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా ఈ సినిమా ఊహించని విధంగా థియేట్రికల్ రిలీజ్ తర్వాత కేవలం నెల రోజుల్లోపే ఓటిటిలో వచ్చేసింది. కాగా ఈరోజు నుంచి సౌత్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు అందుబాటులో ఉంది.

కాగా ఈ చిత్రం హిందీ రిలీజ్ ఎలాగో వస్తుంది కానీ తర్వాత మాత్రం ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ కానుంది. మరి హిందీ అండ్ ఇంగ్లీష్ లో కూడా ఈ రాబోతున్న ఫిబ్రవరి నెలలో అదే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారానికి తీసుకొస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో సలార్ పాన్ ఇండియా కాకుండా పాన్ ఇంటర్నేషనల్ రిలీస్ అతి త్వరలోనే ఉండబోతుంది అని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా పృథ్వీ రాజ్, జగపతి బాబు తదితరులు నటించారు. అలాగే మేకర్స్ ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తుండగా రెండో పార్ట్ షూటింగ్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ అవుతుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి.