“దేవర” ఫస్ట్ లుక్..ఫ్యాన్స్ కి దెబ్బేసావ్ కదా కొరటాల.!

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ కి పరిచయం అవుతూ వస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమానే “దేవర”. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమా అలాగే దర్శకుడు కొరటాల శివతో రెండో సినిమా ఇది కాగా దీనిపై ఇప్పటి వరకు భారీ హైప్ నెలకొంది.

ఎన్టీఆర్ ని అయితే అసలు నెవర్ బిఫోర్ రోల్ లో చూడనుండగా నిన్ననే ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ అండ్ సినిమా టైటిల్ ని రిలీజ్ చేశారు. అయితే “దేవర” అనే పవర్ ఫుల్ టైటిల్ ని మేకర్స్ లాక్ చేసి రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ పోస్టర్ విషయంలో మాత్రం చాలా మంది ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారట.

మెయిన్ గా అంత ఊహించని రేంజ్ లో ఈ పోస్టర్ లేకపోగా మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ భారీ హిట్ “వాల్తేరు వీరయ్య” నుంచి ఓ పోస్టర్ కి దగ్గరగా ఉండడంతో మరింత డిజప్పాయింటింగ్ అంశంగా మారింది. కాగా రెండు సినిమాలు కూడా దగ్గరదగ్గర సంబంధం ఉండడంతో కొరటాల ని మరోసారి ఫ్యాన్స్ ట్రోల్స్ చేసుకుంటున్నారు.

పైగా రెండు పోస్టర్స్ కూడా వేసి ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ విషయంలో మాత్రం కొరటాల ఒకింత డిజప్పాయింట్ చేసాడనే చెప్పి తీరాలి. ఇక ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా అనిరుద్ అందిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మాణం వహిస్తున్నారు.