టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గ తేడాది దేవర సినిమాతో సోలో హీరోగా కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 550 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. కొన్ని రోజుల క్రితం జపాన్లో దేవర సినిమా విడుదల కాగా ఈ సినిమా జపాన్ ప్రమోషన్లలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోస్ సైతం తెగ వైరల్ అయ్యాయి.
బాద్షా సినిమా నుంచి జపాన్లో జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నారు. సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో జపాన్లో అభిమానులు ఉన్న హీరో తారక్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ జపాన్ అభిమాని గురించి చెబుతూ ఎమోషనల్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
నేను ఎప్పుడు జపాన్ సందర్శించిన జపాన్ నాకు మంచి జ్ఞాపకాలను అందిస్తుందని తారక్ అన్నారు. అయితే ఈసారి భిన్నంగా అనిపించిందని ఎన్టీఆర్ కామెంట్ చేశారు. త్రిబుల్ ఆర్ సినిమా చూసి తెలుగు నేర్చుకున్నానని ఒక జపనీస్ అభిమాని చెప్పడం నన్ను కదిలించిందని తారక్ అభిప్రాయపడ్డారు. భాషలు సినిమా అభిమానులకు విభిన్నమైన సంస్కృతులతో పాటు భాష నేర్చుకోవడానికి సినిమా దోహదపడుతున్నందుకు సంతోషిస్తున్నానని భారతీయ సినిమా ప్రపంచ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకోవడానికి ఇది కూడా మరో కారణం అని ఎన్టీఆర్ కామెంట్ చేశారు. తన జపనీస్ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు.
అతి త్వరలో ఇండియాకు రానున్న తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కనున్న డ్రాగన్ సినిమాలో నటించనున్నారు. బెంగళూరు నగరానికి 140 కిలోమీటర్ల దూరంలో ఈ సినిమా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.