Movie review: ఇటీవల కాలంలో సినిమాలు వస్తే ఆ సినిమా బాగున్న బాగా లేకపోయినా చాలామంది సినిమాకు ముందుగా నెగిటివ్ రివ్యూ ఇవ్వడం ఆనవాయితీగా మారింది. కనీసం ఆ సినిమా రెండు మూడు రోజుల కలెక్షన్స్ అలాగే ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణని దృష్టిలో పెట్టుకొని రివ్యూస్ ఇవ్వడం మానేసి మొదటి షో చూసి సినిమాకు రివ్యూలు ఇవ్వడం జరుగుతుంది.
ఇక ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలన్నింటికీ కూడా పాజిటివ్ రివ్యూ కంటే ఎక్కువగా నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇలాంటి రివ్యూ రావడానికి కారణం అభిమానులే అని చెప్పాలి. తమ హీరో సినిమా బాగుండాలి అన్న ఉద్దేశంతో మరో హీరో సినిమాపై దుష్ప్రచారం చేస్తూ ఇలాంటి నెగిటివ్ రివ్యూ ఇవ్వటానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క హీరో సినిమా కూడా ముందు నెగిటివ్ రివ్యూనే బయటకు వస్తుంది.
ఇలాంటి తరుణంలోనే యూట్యూబర్, రివ్యూయర్ పూల చొక్కా నవీన్ సినిమాలకు ఇచ్చే రివ్యూల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన సినిమాలకు ఇచ్చే నెగటివ్ రివ్యూల గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. తాను సినిమా నచ్చితే సినిమాకు పాజిటివ్ రివ్యూ లేదంటే సినిమాలో ఉన్న లోపాలను బయట పెడుతూ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది కానీ దేవర సినిమా విషయంలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది అంటూ తెలిపారు.
దేవర సినిమా విడుదల సమయంలో ఒక హీరో పిఆర్ఓ నా వద్దకు వచ్చి సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వమని చెప్పారు అలా ఇస్తే తనకు పదివేల రూపాయలు డబ్బులు ఇస్తానని కూడా ఆయన ఆఫర్ చేశారు. ఇలా పిఆర్ఓ నాకు ఆఫర్ ఇవ్వడంతో నేను రిజెక్ట్ చేసానని తెలిపారు. ఒక మంచి సినిమాకి నేను నెగిటివ్ రివ్యూ ఇస్తే నా క్రెడిబిలిటీ మొత్తం పోతుంది నేను అలా చేయనని చెప్పేసాను.
ఇలా తెరు వెనక పిఆర్ఓలు తమ హీరో సినిమాలను ప్రమోట్ చేస్తూ సక్సెస్ చేయటం కంటే కూడా వేరే హీరోల సినిమాలను తొక్కేయాలని తపన పడుతున్నారంటూ ఈ సందర్భంగా పూల చొక్కా నవీన్ సినిమాలకు నెగిటివ్ రివ్యూ ఇవ్వాలి అంటూ డబ్బులు కూడా ఆఫర్ చేస్తున్నారని చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.