కీర్తి సురేష్ కెరీర్ డైలమా.. రంగ్ దే సక్సస్ మీదే ఆశలన్ని ..?

కీర్తి సురేష్ కెరీర్ డైలమాలో ఉందంటున్నారు సినీ అభిమానులు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన కీర్తి సురేష్ డెబ్యూ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా చేరువైంది. ఆ తర్వాత నేను లోకల్, అజ్ఞాత వాసి సినిమాలు చేయగా నేను లోకల్ సూపర్ హిట్ అయితే అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత మహానటి సినిమాతో టాలీవుడ్ లోనే కాదు ఏకంగా సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది. అయితే మహానటి సినిమాతో వచ్చిన క్రేజ్ ని టాలీవుడ్ కంటే కోలీవుడ్ లోనే ఎక్కువ ఉపయోగించుకుంది.

keerthy-suresh-is-in-dilemma-is-all-her-hopes-depends-on-rang-de-success
keerthy-suresh-is-in-dilemma-is-all-her-hopes-depends-on-rang-de-success

కాని అక్కడ కీర్తి సురేష్ నటించిన సినిమాలేవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇదే పెద్ద మైనస్ అంటే నాగార్జున నటించిన మన్మధుడు 2 లో కనీ.. కనిపించని పాత్ర ఒప్పుకొని పొరపాటు చేసింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కమిటవడం కీర్తి సురేష్ చేసిన మరో పొరపాటు. పెంగ్విన్ సినిమాతో ప్రయోగం చేస్తే వికటించింది. మిస్ ఇండియా సినిమా అసలు ఎందుకు ఒప్పుకుందో కీర్తి కి అయినా క్లారిటీ ఉందా లేదా అన్నది చాలామందికి ఉన్న అనుమానం. ఇలాంటి సమయంలోనే గుడ్ లక్ సఖీ అన్న సినిమా చేసింది.

కానీ పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాల ప్రభావం తో ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు. ప్రస్తుతం తెలుగులో కీర్తి సురేష్ చేతిలో ఉంది రెండు సినిమాలు. ఒకటి నితిన్ చేసిన రంగ్ దే. ఈ సినిమా మార్చ్ 26 న రిలీజ్ కి రెడీ అవుతోంది. మరొక సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అయితే అప్పటి వరకు కీర్తి సురేష్ ని టాలీవుడ్ మేకర్స్.. ఇక్కడి ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవాలంటే రంగ్ దే సూపర్ హిట్ అవ్వాలి.. అందులో కీర్తి సురేష్ కి మంచి పేరు దక్కాలి. లేదంటే ఫేడవుట్ లిస్ట్ లో చేరుతుందని అంటున్నారు. చూడాలి మరి రంగ్ దే సినిమా కీర్తి సురేష్ కి లైఫ్ ఇస్తుందా లేదా..!