బిగ్ న్యూస్ : తన ఫ్యాన్ మృతి విషయంలో ఎన్టీఆర్ డిమాండ్.!

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ ని ఏ రీతిలో అభిమానించిన హీరోలు ఉన్నారో తెలిసిందే. మరి ఈ స్టార్ హీరోస్ భారీ మాస్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. మరి ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ తో గ్లోబల్ హీరోగా కూడా మారాడు.

అలాగే ఇపుడు “దేవర” అనే సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా చేస్తుండగా ఈ సమయంలో ఓ షాకింగ్ వార్త అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. కాగా ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు శ్యామ్ అనే వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు అని వార్త రాగ విషాదం నెలకొంది.

అయితే ఈ మరణం సహజ మరణం కాదని శ్యామ్ ని ఎవరో కావాలనే చంపి దానిని ఆత్మ హత్యగా చిత్రీకరించారని మరో కోణం వైరల్ గా మారింది. అయితే ఎట్టకేలకు ఈ ఇష్యూ ఎన్టీఆర్ దగ్గరకి వెళ్లడంతో ఈ విషాద ఘటనపై ఎన్టీఆర్ స్పందించడం వైరల్ గా మారింది.

కాగా ఎన్టీఆర్ అయితే ఈ అంశంపై ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసి శ్యామ్ మరణం చాలా బాధాకరమైన సంఘటన అని అలాగే వారి తల్లిదండ్రులకి నా ప్రఘాడ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను అని అలాగే శ్యామ్ అయితే ఏ రకంగా ఏ కారణాల చేత మరణించాడు అనేది తెలియకపోవడం మరింత బాధ కలిగిస్తుంది అని ఎన్టీఆర్ భావోద్వేగం అయ్యాడు. అలాగే ఈ కేసును పోలీసు శాఖ వారు దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలి అని డిమాండ్ చేసాడు. దీనితో ఒక్కసారిగా ఈ అంశం విషయంలో పెద్ద సపోర్ట్ ఇప్పుడు వచ్చినట్టు అయ్యింది అని చెప్పాలి.