ఆదిపురుష్ లో ప్రభాస్ నిజంగా రాముడి అవతారంలో కనిపించనున్నాడా ! ఇంకేదైనానా?

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న ఆదిపురుష్ భారతదేశంలో నిర్మించబోతున్న భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటి, ఇది వచ్చే ఏడాది లో షూటింగ్ జరుపుకుంటదని, ఓం రౌత్ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రంలో చాలా విఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ ఉంటదని మరియు 3 డి ఫార్మాట్‌లో చిత్రీకరించబడుతుందని సమాచారం. ఫిల్మ్ యూనిట్‌కు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, గ్రాఫిక్స్ కోసం భారీ బడ్జెట్ కేటాయించబడింది మరియు అనేక హాలీవుడ్ చిత్రాలలో కనిపించే గ్రీన్ మాట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రం పూర్తిగా చిత్రీకరించబడుతుంది. ఎపిక్ పీరియడ్ యాక్షన్ మూవీ కోసం గ్రాఫిక్స్ కోసం పని చేయడానికి మేకర్స్ అవతార్ మరియు స్టార్ వార్స్ యొక్క విఎఫ్ఎక్స్ పర్యవేక్షకులతో చర్చలు జరుపుతున్నారు.

Is prabhas going to do Rama charecter or else in Adipurush?

ఈ సినిమా రామాయణం ఇతివృత్తంతో రూపొందుతున్నట్లుగా ఇప్పటిక విడుదలైన టైటిల్ లోగో మరియు మోషన్ పోస్టర్ ను చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ సినిమా గురించి స్పందించిన రాజమౌళితో పాటు ప్రముఖులు అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్న ఈ సమయంలో రాముడిపై సినిమా అంటే ఖచ్చితంగా హైప్ ఉంటుంది. ఆదిపురుష్ కు ఖచ్చితంగా మంచి క్రేజ్ దక్కుతుందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ స్టోరీకి రామాయణంకు సంబంధం లేదు అన్నట్లుగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఆదిపురుష్ లో హీరో పాత్ర రాముడి లా ఉంటుందని.. సినిమాలోని పలు పాత్రలు రామాయణంలో ఉన్న పాత్రల మాదిరిగానే ఉంటాయి. కాని కథ మాత్రం రామాయణం కాదు అంటూ బాలీవుడ్ కు చెందిన ఒక వర్గం మీడియాలో కథనాలు వస్తున్నాయి. రామాయణంలోని పాత్రల స్వభావంను తీసుకుని వాటితో మరో కథను చూపించేదే ఆదిపురుష్ అంటున్నారు.

ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడి పాత్రే అయినా ధనస్సు పట్టుకుని నీలవర్ణంలో కనిపించబోడు. అలాగే ఈ సినిమాలో విలన్ పేరు లంకేష్ అయినా కూడా రావణుడి మాదిరిగా పది తలలు ఉండే రాక్షస రాజు కాదట. మొత్తానికి సినిమా ఖచ్చితంగా అందరి అంచనాలు అందుకునేలా ఉండటంతో పాటు ఊహకు అందని విధంగా ఉంటుందని మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమాను మొదలు పెట్టి 2022లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మన తెలుగు హీరో ఇలానే పాన్ ఇండియా సినిమాలు చేసి తెలుగు వారు అందరూ గర్వపడేలా చెయ్యాలని కోరుకుందాం.