‘దేవర’ని కొరటాల శివ చుట్టేస్తునాడా.?

దర్శకుడు కొరటాల శివ పెద్దగా వివాదాల్లో వుండటానికి ఇష్టపడడు. కానీ, ఆయన చుట్టూ ఈ మధ్య వివాదాలు తరచూ చూస్తున్నాం. ‘ఆచార్య’ సినిమా తర్వాత వచ్చిన మార్పు కాదిది.! అంతకన్నా ముందే, ‘కొరటాల శివ చుట్టేస్తాడు.. లేపేస్తాడు..’ అన్న విమర్శలున్నాయ్. అయితే, అప్పట్లో సక్సెస్ ట్రాక్ మీదున్నాడు.! కానీ, ఇప్పుడు పరిస్థితి వేరే.

తన సినిమాల బిజినెస్ దగ్గర్నుంచి, చాలా విషయాల్లో.. కేవలం అత్యంత సన్నిహితుల్ని.. అందునా, స్నేహితుల్ని మాత్రమే నమ్ముతాడనీ, హీరోలూ అలాగే నిర్మాతలూ ఇబ్బంది పడతారనే విమర్శ వుంది.

సరే, ఎవరి గోల వారిది. ఇంతకీ, ‘దేవర’ సంగతేంటి.? పాన్ ఇండియా సినిమా అంటున్నారు. కానీ, షూటింగ్ పార్ట్ చకచకా జరిగిపోతోందిట.. ఈ ఏడాది చివరి నాటికి.. పూర్తయిపోతుందట కూడా.

అదెలా సాధ్యం.? అంటే, ఇంకేముంది.. చుట్టేస్తున్నాడన్న విమర్శలొస్తున్నాయి. ఏమో, నిజమెంతో.. నిప్పు లేకుండా పొగ అయితే రావట్లేదు కదా.!