ఇన్సైడ్ టాక్ : ప్రభాస్ “సలార్” ని ఇలా తీసేసారా?

పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో మన టాలీవుడ్ నుంచి పలు సినిమాలు ఉండగా వాటిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. కాగా ఈ సినిమాల్లో అయితే తాను కన్నడలో చేస్తున్న మాసివ్ బైలింగ్వల్ చిత్రం “సలార్” కూడా ఒకటి.

మరి ఈ చిత్రం ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది. కాగా ఈ చిత్రం రిలీజ్ కూడా దగ్గరకి వస్తుంది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని కూడా తన కేజీఎఫ్ సినిమాల్లానే రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టు ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ ఇన్సైడ్ టాక్ ఏమిటంటే నిజానికి సలార్ సినిమా ఎప్పుడో కంప్లీట్ అయిపోయిందే అట. కానీ పార్ట్ 2 ని కూడా చాలా మేర షూటింగ్ ని మేకర్స్ చేసేసారు అని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎలాగో సమయం ఉంది కాబట్టి మేకర్స్ పార్ట్ 2 ని షూటింగ్ అవసరమైన సీన్స్ తీసేసారు అని టాక్.

మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా ఈ చిత్రం విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ అసలు సినిమా చేస్తున్నారా ఇంకేమన్నా తీస్తున్నారా ఇన్ని రోజులు షూట్ చేస్తుంటే డౌట్స్ అలానే ఉన్నాయి. దీనితో రెండు భాగాలూ ఒకేసారి తీసినా ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ఇక ఈ మాసివ్ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.