ఇండస్ట్రీ టాక్ : “హరిహర వీరమల్లు” కొత్త గిఫ్ట్ ఆరోజున.?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో మొదటి వరుసలో ఉన్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా దర్శకుడు క్రిష్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఇప్పటివరకు 70 శాతం వరకు షూటింగ్ కంప్లీట్ కాగా నిన్న ఖుషి రీ రిలీజ్ తో అయితే సినిమా నుంచి కొత్త టీజర్ రావాల్సి ఉంది. కానీ ఈ సినిమా నుంచి ఈ కొత్త గిఫ్ట్ ఎపుడుకి ఫిక్స్ అయ్యింది అనేది కొన్ని రూమర్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మరి ఈ అప్డేట్ తో అయితే సినిమా కొత్త టీజర్ ఈ జనవరి లోనే ఉంటుందట. మరి దీనిని ఈ జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో అయితే భారీ విజువల్స్ సహా పవన్ నుంచి సరికొత్త పోరాట సన్నివేశాలు చూడనున్నాము. అలాగే ఈ సినిమా అయితే రిలీజ్ ఈ ఏడాది వేసవిలోనే ఉంటుంది అని టాక్ ఉంది. ఇంకా కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై పవన్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.