వైరల్ : ఆ హీరోతో రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హన్సిక.!

రీసెంట్ గా మన టాలీవుడ్ హీరోయిన్స్ విషయంలో పలు అంశాలకి సంబంధించి కొన్ని షాకింగ్ రూమర్స్ బయటకి రావడం వాటికీ ఆ హీరోయిన్స్ కూడా ఒకేలా రియాక్ట్ అవ్వడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి గత కొన్ని రోజులు కితమే మిల్కీ బ్యూటీ తమన్నా పై ఆమె బాలయ్య సినిమాలో ఉంది అంటూ పలు గాసిప్స్ రాగ వాటిపై గట్టిగానే స్పందించింది.

ఇలాంటి వార్తలు ఏమాత్రం రీసెర్చ్ లేకుండా ఎలా రాష్ట్రాలు అంటూ స్మూత్ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇపుడు మరో మిల్కీ బ్యూటీ హన్సిక మోత్వానీ విషయంలో కూడా కొన్ని షాకింగ్ రూమర్స్ వైరల్ గా మారాయి. ఆమెని ఓ స్టార్ హీరో తనతో డేటింగ్ కి రమ్మని ఇతర అంశాల్లో విసిగించేవాడని కానీ అతడిని తగిన బుద్ది నేను చెప్పాను అంటూ ఆ హీరో పేరు బయట పెట్టకుండా కొన్ని రూమర్స్ ఓ రేంజ్ లో స్ప్రెడ్ అవ్వడం మొదలయ్యాయి.

అయితే ఈ హీరో హన్సిక కెరీర్ స్టార్టింగ్ లో చేసిన ఓ హీరోనే అంటూ కొందరు నెటిజన్స్ కూడా తమ సైకోతనాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శించారు. అయితే ఇది ఎలానో హన్సిక దృష్టికి వెళ్లగా ఆమె వీటిపై తమన్నా తరహాలోనే స్పందించింది.

“ఇలాంటి వార్తలు ప్రచారం చేసేవాళ్ళు ముందు కాస్త ఆలోచించండి అందులో నిజం ఉందా లేదా అనేది. నేను అయితే అలాంటి కామెంట్స్ ఎప్పుడూ ఎవరి మీద కూడా చెయ్యలేదు. ముందు నిజానిజాలు తెలుసుకోండి అవి తెలుసుకోకుండా గుడ్డిగా ప్రచారాలు చేసెయ్యొద్దు” అంటూ ఘాటైన స్పందన ఇచ్చింది. దీనితో హన్సిక విషయంలో వచ్చిన రూమర్స్ అన్నీ అబద్దం అని తేలిపోయింది. 
ttps://twitter.com/ihansika/status/1661013487936745473?t=bPALA5tPD9TYaJVGKjN2bA&s=19