ఆ ఒక్కరు తప్ప బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవాళ్లంతా ఫేక్.. సరయు ఆసక్తికర వ్యాఖ్యలు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో మొదట 19 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. ప్రస్తుతం టాప్ 7 మెంబర్స్ ఉన్నారు. ఎలిమినేట్ అయిన వారిలో ఎంతో మంది మంచి కంటెంట్ ఇచ్చినవాళ్లు.. గేమ్ లను బాగా ఆడినవారు కూడా ఉన్నారు. కానీ బిగ్ బాస్ నిర్వాహకలు మాత్రం మరి ఏం చూసి వాళ్లను బయటకు పంపిస్తున్నారో తెలియకుండా పోతోంది.

తాజాగా యాంకర్ రవి ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ పై ప్రతి ఒక్కరూ విరుచుపడుతున్నారు. అదంతా ఫేక్ అంటూ ఏకిపారేస్తున్నారు. అయితే మొదటి వారమే ఎలిమినేట్ అయిన 7 ఆర్ట్స్ ఫేమ్ సరయు గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఆమె తన యూట్యూబ్ ఛానల్లో డబుల్ మీనింగ్స్ వచ్చే విధంగా.. బోల్డ్ గా మాట్లాడుతుంది. నోరు తెరిస్తే చాలు బూతు పురాణంతో రెచ్చిపోతుంది.

అయితే ఆమె మొదటి వారం ఎలిమినేట్ అవ్వడానికి కారణం.. ఆమె మాట్లేడే తీరు మాత్రం కాదు. అందులో ఆమె డిగ్నిటీగానే కనిపించారు. కానీ హౌస్ లో సిగరెట్టు తాగడం.. కారణం లేకుండా ఇతర కంటెస్టెంట్లను టార్గెట్ చేయడంతో.. ఈమె మొదటి వారంలోనే ఎలిమినేట్ అయి బయటికి వచ్చారు. తర్వాత హౌస్ నుంచి బయటకు వస్తున్న ఇతర కంటెస్టెంట్లతో ఆమె బాగానే ఎంజాయ్ చేస్తోంది.

స్టార్ మాలో ప్రసారం అవుతున్న షోలో కూడా పాల్గొంటుంది. ఇక తాజాగా యాంకర్ రవి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రవికి సపోర్టు చేయండి అంటూ పోస్టు పెట్టింది. బిగ్ బాస్ లో ఉన్న వాళ్లంతా ఫేక్ .. ఒక్క రవి తప్ప అని సరయు చెప్పుకొచ్చింది. అయితే రవి ఎలిమినేట్ అయ్యాడని సరయు అలాంటి పోస్ట్ పెట్టిందా..? లేకపోతే రవి ఇంకా హౌస్ లోనే ఉంటాడని ఆ పోస్టు పెట్టిందో నెటిజన్లకు అర్థం అవ్వట్లేదు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.