బిగ్ అప్డేట్ : “గుంటూరు కారం” ఫాన్స్ కి ఒకే రోజు డబుల్ ధమాకా

రాబోతున్న సంక్రాంతి ఫెస్టివల్ లో ఐతే టాలీవుడ్ సినిమా నుంచి పలు భారీ చిత్రాలు ఉండగా ఈ చిత్రం టాలీవుడ్ ఎవర్ ఛార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న అవైటెడ్ చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి.

కాగా ఈ చిత్రం ఒకటే అతి పెద్ద సినిమా కాగా దీని కోసమే ఎక్కువ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా పై ఒకో సాలిడ్ అప్డేట్ ని అందిస్తుండగా నిన్ననే యంగ్ నిర్మాత నాగవంశీ సినిమా ట్రైలర్ ఎప్పుడు అనేది రివీల్ చేసాడు. దీనితో ఈ ట్రైలర్ జనవరి 6న వస్తుంది అని అందులో కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు దీనిపై చిత్ర బృందం అఫీషియల్ అప్డేట్ కూడా ఇచ్చేసింది.

ట్రైలర్ ఆరోజే వస్తుంది అని కన్ఫర్మ్ చేయడమే కాకుండా అదే రోజున సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జరుగుతుంది అని కన్ఫర్మ్ చేసేసారు. దీనితో ఒకే రోజు మహేష్ ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అని చెప్పాలి. దీనితో గుంటూరు కారం మాస్ ట్రీట్ ఆరోజు వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి.

చాలా మంది అయితే ఈ ట్రైలర్ కోసం చూస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఏమన్నా మ్యాజిక్ చేస్తాడా లేదా అనేది చూడాలి అని వెయిట్ చేస్తున్నారు. మరి ఈ ట్రైలర్ లో గురూజీ మ్యాజిక్ ఉంటుందో లేదో చూడాలి. ఇంకా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా శ్రీలీల మీనాక్షి చౌదరిలు నటించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.