తమ సినిమాల ఇన్నేళ్ల కెరీర్ లో ఒక్క సినిమాతో అయితే తమ లైఫ్ ని మార్చేసుకున్న హీరోస్ లో కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ కూడా ఒకరు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేసిన “కేజీఎఫ్” ఫ్రాంఛైజ్ తో తాను పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అయితే ఈ సినిమాల తర్వాత తన స్టార్డం ని మ్యాచ్ చేసే సినిమా చేస్తాడా లేదా అనేది చాలా ఆసక్తిగా మారగా..
కన్నడ స్టార్ నిర్మాణ సంస్థ తో అయితే ఓ భారీ సినిమాని తన కెరీర్ లో 19వ సినిమాని తాను ఓకే చేసాడు. అయితే అక్కడ నుంచి దీని దర్శకులు ఎవరు అనే ప్రశ్న పెద్ద ఎత్తున సస్పెన్స్ గా మారగా దీనికి గాను ప్రముఖ మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ అయితే లైన్ లోకి వచ్చారు.
మరి ఓ లేడీ డైరెక్టర్ తో యష్ సినిమా చేస్తున్నాడు.. ఈ ప్రాజెక్ట్ అంచనాలు అందుకుంటుందా అంటే? డెఫినెట్ గా అందుకుంటుంది అనే టాక్ ఇపుడు వినిపిస్తుంది. ఎందుకంటే ఈ చిత్రానికి ఆ తరహా బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నారట. మరి ఈ చిత్రం కూడా కేజీఎఫ్ తరహాలో భారీ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారట.
దీనితో యష్ నుంచి మరో సాలిడ్ గ్యాంగ్ స్టర్ డ్రామా రాబోతుంది అనేది కన్ఫర్మ్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉందని దాదాపు ఈ కాంబినేషన్ లో ఇదే బ్యాక్ డ్రాప్ లో సినిమా ఖాయమని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మున్ముందు రానుంది.