క్రేజీ న్యూస్ : “సలార్” టీజర్ సెన్సార్, రన్ టైం డీటెయిల్స్ మీకోసం!

ప్రెజెంట్ పాన్ ఇండియా మార్కెట్ దగ్గర ఈజీగా 1000 కోట్ల భారీ వసూళ్లు అందుకునే సినిమాల లిస్ట్ లో అయితే ఈ ఏడాది నుంచి పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచే రెండు రాబోతున్నాయి అని చెప్పాలి. కాగా ఈ చిత్రాల్లో మొదటగా ఇపుడు భారీ చిత్రం “ఆదిపురుష్” జూన్ రిలీజ్ కి సిద్ధంగా ఉండగా నెక్స్ట్ అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ ఏక్షన్ థ్రిల్లర్ సినిమా “సలార్” కోసం కూడా ఒకటి.

కాగా ఈ సినిమా నుంచి బిగ్గెస్ట్ ట్రీట్ మాస్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా టీజర్ ని అయితే ఆదిపురుష్ ప్రింట్ తో కలిపి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా సాలిడ్ బజ్ ఇప్పుడు ఉండగా ఈ సినిమా టీజర్ పై ఇప్పుడు సినీ వర్గాల నుంచి మరో క్రేజీ న్యూస్ ఇప్పుడు తెలుస్తుంది.

కాగా ఈ చిత్రం టీజర్ రీసెంట్ గానే సెన్సార్ కంప్లీట్ చేసుకోగా యూ/ఏ టీజర్ గా ఇది సర్టిఫై అయ్యిందట. అలాగే మరోపక్క టీజర్ రన్ టైం కూడా ఇప్పుడు తెలుస్తుంది. కాగా ఈ క్రేజీ టీజర్ ఒక నిమిషం 30 సెకండ్స్ మేర ఉంటుంది అని సమాచారం.

దీనితో ఈ టీజర్ పై మరింత హైప్ నెలకొంది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ లో పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తుంది.