Chiranjeevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి తన స్వసక్తితో ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున అవకాశాలను అందుకున్నారు. ఇలా నటుడిగా ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ యువ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.
ఇక చిరంజీవి సినిమాలలో కొనసాగుతూ ఎన్నో వ్యాపారాలలో పెట్టుబడులు కూడా పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఒకవైపు వ్యాపారాలలో పెట్టుబడి పెడుతూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చిరంజీవి ముందు వరుసలో ఉండి తనదైన శైలిలోనే సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా చిరంజీవికి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. చిరంజీవి 6000 కోట్ల రూపాయలతో అధునాతన సౌకర్యాలు ఉన్నటువంటి ఒక క్రూయిజర్ షిప్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.
ఈ క్రూయిజర్ షిప్ సునామీ వచ్చిన, భూకంపం వచ్చిన ఎలాంటి ప్రమాదం రాదని, అలాగే బుల్లెట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ తో తయారు చేశారని తెలుస్తోంది. ఇందులో 350 కంటే ఎక్కువ బెడ్ రూమ్లు, 474 కంటే ఎక్కువ బాత్రూంలో, షాపింగ్ మాల్స్, సినిమా ధియేటర్లు, రెస్టారెంట్లు, వాటర్ పార్కులు ఇలా అన్ని లగ్జరీ ఫెసిలిటీలు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ క్రూయిజ్ కేవలం లండన్ ,అమెరికా, ప్యారిస్, అండమాన్ లాంటి విదేశాలకు మాత్రమే ప్రయాణం చేస్తుందట.
ఇక ఈ షిప్ ద్వారా చిరంజీవి ప్రతి ఏడాది 125 కోట్ల రూపాయల వరకు ఆదాయం అందుకుంటున్నారని సమాచారం. మరి చిరంజీవి క్రూయిజర్ షిప్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఇటీవల రేవంత్ రెడ్డితో పాటు.. చిరు హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ ఎక్కో పార్క్ సందర్శించిన సంగతి తెలిసిందే. ఆ టైంలో దిగిన ఫొటోస్ తో.. ఇతర దేశాల్లో ఉన్న లగ్జరీ షిప్లను ఎడిట్ చేసి చిరంజీవిని ఆ క్రూయిజర్ కొన్నట్లుగా ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు.