Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ప్రస్తుత ఈయన డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేశారు.. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి డైరెక్టర్ అనిల్ రావిపూడి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. తాజాగా ఈయన ఈ సినిమా గురించి ఒక కీలక అప్డేట్ విడుదల చేశారు. ఇక ఈ ట్వీట్ ద్వారా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను బయటపెట్టారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ట్వీట్ చేస్తూ…
ఫైనల్ స్క్రిప్ట్ నేరేషన్ అయిపోయింది. చిరంజీవి గారికి నా కధలో పాత్ర “శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను. ఆయనకు బాగా నచ్చింది, ఆ పాత్రని బాగా ఎంజాయ్ చేసారు. ఇంకెందుకు లేటు, త్వరలో ముహూర్తంతో… ‘చిరు’ నవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కి చిరంజీవితో పాటు నిర్మాణ సంస్థలు షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ని ట్యాగ్ చేసారు.
Final script narration done & locked 📝☑️🔒
చిరంజీవి గారికి నా కధ లో పాత్ర
“శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను .. 😄
He loved & enjoyed it thoroughly ❤️🔥ఇంకెందుకు లేటు,
త్వరలో ముహూర్తంతో…
‘చిరు’ నవ్వుల పండగబొమ్మ కి శ్రీకారం 🥳#ChiruAnilMegaStar @KChiruTweets garu…
— Anil Ravipudi (@AnilRavipudi) March 26, 2025
ఇలా ఈ ట్వీట్ కారణంగా ఈ సినిమాలో చిరంజీవి పాత్ర పేరు శంకర వరప్రసాద్ అని తెలిపారు. ఇక ఈ సినిమాని ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయని చెప్పకనే చెప్పేసారు. ఇక ఈ సినిమా నిర్మాణంలో చిరు కూతురు సుస్మిత కొణిదెల తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ తో భాగమవుతుంది అని కూడా ఈ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.