బాక్సాఫీస్ రిపోర్ట్ : “ది వారియర్” 2 డేస్ వసూళ్ల వివరాలు ఇవే..!

ఈ ఏడాది మన టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో ఎంత మంచి మాస్ సినిమాలు వచ్చినా కూడా ఆడియెన్స్ లో అయితే ఆసక్తి ఏమాత్రం పెరగడం లేదు. అయితే కాస్త ఈ వాతావరణం పికప్ అవుతుంది అని ఆశించిన చిత్రం మాత్రం “ది వారియర్”.

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు ఎన్ లింగుసామి పని చేశారు. అయితే ముందు నుంచి బాగానే అంచనాలు నెలకొన్నా తర్వాత ఈ సినిమాపై కూడా ఆసక్తి తగ్గిపోయింది. దీనితో ఓపెనింగ్స్ కూడా అనుకున్న రేంజ్ లో రాలేదు కానీ మేకర్స్ అయితే మంచి నెంబర్స్ నే బయట పెట్టారు.

కానీ ఇంకా ఈరోజు రెండో రోజుకి సంబంధించి వసూళ్లు అయితే బయటకి వచ్చినట్టు ఎక్కడా కనిపించలేదు. మరి దీనికి రెండో రోజు భారీగా కలెక్షన్ డ్రాప్ అవ్వడమే అని ట్రేడ్ వర్గాలు వారు చెబుతున్నారు. ఇక రెండు రోజులు వసూళ్లు చూసినట్టు అయితే ఏపీ తెలంగాణాలో ఈ చిత్రం 9.3 కోట్ల షేర్ ని అందుకోగా..

ఇక తమిళ్ సహా ఓవర్సీస్ వసూళ్లు కలిపి సుమారు 1.3 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో రెండు రోజులకి కలిపి ఈ చిత్రానికి 10.6 కోట్ల షేర్ వసూలు అయ్యింది. అలాగే 16 కోట్లకి పైగా గ్రాస్ వచ్చింది. అయితే రెండో రోజుకి 50 శాతం కన్నా తక్కువే వసూళ్లు నమోదు అయ్యాయి. మరి ఓవరాల్ గా అయితే ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి.