“ఉప్పెన” లో ఆ సీన్స్ వల్ల వదులుకున్న యంగ్ హీరోయిన్..!

uppena telugu movie review

టాలీవుడ్ సినిమా దగ్గర భారీ హిట్ అయ్యిన కొన్ని డెబ్యూ చిత్రాల్లో ఒక దర్శకునికి హీరోకి అలాగే ఒక హీరోయిన్ కి కూడా ఇలాంటి హిట్ కొట్టాలి అని చూపించిన హిట్ సినిమానే “ఉప్పెన”. మెగా కుటుంబం నుంచి వచ్చిన ఓ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమా తోనే 100 కోట్ల గ్రాస్ లో చేరాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి ఈ సినిమాతోనే టాలీవుడ్ లో పరిచయం కాగా ఈ సినిమాతో ఆమె కూడా ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోయి వరుసగా అనేక ఆఫర్స్ ని సొంతం చేసుకుంది. అయితే ఈమె ప్లేస్ లో మొదట చాలా మందిని అనుకున్నారు. 

కానీ ఇప్పుడు వారిలో ఓ యంగ్ హీరోయిన్ అది కూడా కాంట్రవర్సియల్ ఫ్యామిలీ జీవితా రాజశేఖర్ ల కూతురు అయినటువంటి శివాని రాజశేఖర్ ని అనుకున్నారట. ఆమెకి కథ కూడా చెప్పారు కానీ ఆమె సినిమా నుంచి తప్పుకుంది. కాగా అందుకు కారణం కూడా తెలుస్తుంది.

ఆమెకి కథ నార్త్ చేసినపుడు సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ విషయంలో ఆమె ఇబ్బందిగా ఫీల్ అయ్యిందట. అందుకే ఆమె సినిమా నుంచి తప్పుకుంది అని అప్పుడు కథ కృతి శెట్టి దగ్గరకి వెళ్ళింది. ఇక నెక్స్ట్ ఆ సినిమా ఎలాంటి హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ని అయితే శివాని వదులుకుంది మరి.