డైరెక్టర్ తనని కొట్టాడంటున్న మమిత బైజు.. అంత లేదంటున్న డైరెక్టర్!

మలయాళంలో వచ్చిన ‘ప్రేమలు’సినిమా అక్కడ భారీ హిట్ అవ్వడంతో రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసాడు. ఇక్కడ కూడా ప్రేమలు సినిమా భారీ విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రీను పాత్రలో నటించిన మమిత బైజు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. మలయాళంలో కంటే తెలుగులోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది మమిత. ఏకంగా రాజమౌళి సైతం నాకు మమిత నచ్చింది అని ట్వీట్ చేసాడు.మమిత బైజుకి ఇది మొదటి సినిమా కాదు.

దీనికంటే ముందు చాలా సినిమాలు చేసింది. కానీ ఏ సినిమాకి రానంత గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది. అయితే తాజా సూర్య, మమిత, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో బాల వణంగాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ పాత్రలో సూర్య చెవిటి, మూగ పాత్రలో నటించనున్నాడట. కారణాలు తెలియవు కానీ ఈ ప్రాజెక్టు నుంచి సూర్య, కృతి శెట్టి కూడా తప్పుకున్నారు.

అయితే మమిత కూడా ఈ సినిమా నుంచి తప్పుకుందని దర్శకుడు మమిత పై చేయి చేసుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా సెట్ లో మమితను బాల వణంగాన్ కొట్టాడని వస్తున్న వార్తలపై తాజాగా బాల స్పందించాడు. మమిత తన కూతురు లాంటిదని అన్నాడు. అలాంటి అమ్మాయిని నేను ఎందుకు కొడతాను అని బాల అన్నారు.

నమిత ఓవర్ మేకప్ వేసుకొని లోకేషన్ కి వస్తే ఎందుకు వేసుకున్నావు అంటూ గట్టిగా అరిచాను అంతేగాని ఆమెని కొట్టలేదు,ఈ సినిమాలో 40 రోజులు పాటు నటించింది, ఇప్పుడు సినిమా నుంచి తప్పుకోవడం వలన మళ్ళీ సినిమాని రీ షూట్ చేస్తున్నాం అంటూ సంజాయిషీ ఇచ్చాడు. కొద్దిరోజుల క్రిందట ఒక ఇంటర్వ్యూ ఇస్తూ బాలా నన్ను కొట్టారు అందుకే సినిమా నుంచి తప్పుకున్నానని చెప్పిన మమిత ఇప్పుడు మాట మార్చేసి నా మాటలను మీడియా వక్రీకరించింది అంటూ మరొక స్టేట్మెంట్ ఇవ్వటం గమనార్హం.