సంచలనం సృష్టిస్తున్న టోవినో థామస్ ‘ARM’ ఫస్ట్ లుక్

వరుస హిట్‌లతో దూసుకుపోతున్న టోవినో థామస్ తన తాజా పాన్-ఇండియా ఫాంటసీ చిత్రం ”ARM”తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, డాక్టర్ జకారియా థామస్ నిర్మిస్తున్నారు. పూర్తిగా 3డిలో రూపొందిన ”ARM” మలయాళ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటి. టోవినో థామస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది.

మూడు యుగాల కథ, “ARM” టోవినో థామస్‌ను 3 విభిన్న పాత్రలు – మణియన్, అజయన్, కుంజికేలుగా ప్రజెంట్ చేస్తోంది. భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం ఖగోళ రహస్యం బ్యాక్ డ్రాప్ లో వుండటంతో విజువల్ వండర్ గా ఉండబోతుందని హామీ ఇచ్చింది. ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం మలయాళం, హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ 6 భాషల్లో విడుదల కానుంది.

“ARM” చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి వంటి భారీ తారాగణం ఉంది, ప్రముఖ నటులు బాసిల్ జోసెఫ్, జగదీష్, హరీష్ ఉత్తమన్, హరీష్ పేరడి, ప్రమోద్ శెట్టి, రోహిణి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సుజిత్ నంబియార్ స్క్రిప్ట్ రాశారు. దిబు నైనన్ థామస్ సంగీతం అందించారు.

తారాగణం: టోవినో థామస్, కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ మరియు సురభి లక్ష్మి, బాసిల్ జోసెఫ్, జగదీష్, హరీష్ ఉత్తమన్, హరీష్ పెరడి, ప్రమోద్ శెట్టి, రోహిణి.

సినిమా డిటెయిల్స్ :
మూవీ: ARM
బ్యానర్లు: మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జితిన్ లాల్
నిర్మాతలు: లిస్టిన్ స్టీఫెన్, డా. జకారియా థామస్
కథ: సుజిత్ నంబియార్

సంగీతం: దిబు నైనాన్ థామస్
అదనపు స్క్రీన్ ప్లే: దీపు ప్రదీప్, జోమోన్
టిసినిమాటోగ్రఫీ: జాన్
ఎడిటర్: షమీర్ ముహమ్మద్
ప్రాజెక్ట్ డిజైన్: N.M. బాదుషా.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డా.వినీత్ MB
ప్రొడక్షన్ డిజైన్: గోకుల్ దాస్
మేకప్: రాన్క్స్ జేవియర్
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రవీణ్ వర్మ
ప్రొడక్షన్ కంట్రోలర్: ప్రిన్స్ రాఫెల్

ఫైనాన్స్ కంట్రోలర్: షిజో డొమెనిక్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లిజు నాదేరి
క్రియేటివ్ డైరెక్టర్: దీపిల్ దేవ్
కాస్టింగ్ డైరెక్టర్: షనీమ్ సయీద్
కాన్సెప్ట్ ఆర్ట్ & స్టోరీబోర్డ్: మనోహరన్ చిన్న స్వామి

స్టంట్స్: విక్రమ్ మోర్, ఫీనిక్స్ ప్రభు
సాహిత్యం: మను మంజిత్
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: శ్రీలాల్
అసోసియేట్ డైరెక్టర్లు: శరత్ కుమార్ నాయర్, శ్రీజిత్ బాలగోపాల్

సౌండ్ డిజైన్: సింగ్ సినిమా
ఆడియోగ్రఫీ: ఎంఆర్ రాజాకృష్ణన్
డిజిటల్ – తనయ్ & దిలీప్ లెక్కల
పీఆర్వో – వంశీ – శేఖర్