అప్పట్లో కృతి శెట్టి, ఇప్పుడేమో శ్రీలీల.! తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే చర్చ జరుగుతోంది. కృతి శెట్టి కూడా అంతే.. ఎడా పెడా సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించేసుకుంది. అంతే వేగంగా, స్టార్‌డమ్ కోల్పోయింది.. అదీ వరుస వైఫల్యాల నేపథ్యంలో.
సినిమా హిట్టయితే హీరో ఖాతాలో, ఫెయిల్ అయితే హీరోయిన్ ఖాతాలో వేసెయ్యడం మామూలే. అలా కృతి శెట్టి బలైపోయింది. ఇప్పుడు శ్రీలీల కూడా బలైపోతోంది. కాకపోతే, శ్రీలీల చేతిలో పెద్ద ప్రాజెక్ట్ ‘గుంటూరు కారం’ వుంది. అంతే తేడా.!
పొరపాటున ‘గుంటూరు కారం’ సినిమా గనుక తేడా కొడితే, ఇకపై శ్రీలీలతో సినిమా అంటేనే భయపడాల్సి రావొచ్చు దర్శక నిర్మాలకి. అయినా, అందులో శ్రీలీల తప్పేముంది.? తప్పేమీ వుండదు.. కానీ, అంతే.
పద్ధతి ప్రకారం ఓ మాఫియా, హీరోయిన్ల రేంజ్‌ని తాత్కాలికంగా పెంచేయడం, పడేయడం ఇటీవలి కాలంలో చూస్తున్నాం. కృతి శెట్టి చేయాల్సిన ప్రాజెక్టుల్ని శ్రీలీలకు అంటగట్టిన మాఫియా, ఇప్పుడు ఆ శ్రీలీలనీ తొక్కిపడేసేందుకు ప్రయత్నిస్తోందిట.
ఎంత సేపు లేపుతాం.. ఎంతసేపు పడేస్తాం.. అన్నట్లు వ్యవహరిస్తోంది సదరు మాఫియా. దీన్ని పీఆర్ మాఫియా అనొచ్చా.? అంతేనేమో.! ఆ మాఫియానే కదా కాంబినేషన్లను సెట్ చేస్తున్నదీ, కాంబినేషన్లని నాశనం చేస్తున్నదీ.!