బ్లాస్టింగ్ న్యూస్ : “సలార్” టీజర్ కి డేటు ఫిక్స్.!

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్”. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ మహా ఇతిహాస కావ్యం అయితే రామాయణం ఆధారంగా ఇండియన్ సినిమా నుంచి ఓ ఫుల్ ఫ్లెడ్జ్ లైవ్ మోషన్ పిక్చర్ గా అయితే రాబోతుంది.

మరి ఈ బిగ్గెస్ట్ విజువల్ డ్రామా కోసం ఎంతగా ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారో దీని తర్వాత ప్రభాస్ నుంచి రాబోయే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” కోసం కూడా అంతకు మించి ఆసక్తితో అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా టీజర్ అయితే గత ఏడాది నుంచి కూడా ఓ రేంజ్ లో ఆసక్తి రేపగా..

ఫైనల్ గా ఈ టీజర్ రాక కి సమయం ఆసన్నం అయ్యినట్టుగా లేటెస్ట్ గా బ్లాస్టింగ్ బజ్ ఐతే వినిపిస్తుంది. మరి ఈ టీజర్ ఇంతకీ ఎప్పుడు వస్తుంది అంటే ఈ జూన్ లో రాబోతున్న “ఆదిపురుష్” సినిమాతోనే వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అట. అంటే ఈ జూన్ 16న “సలార్” మాస్ ట్రీట్ కూడా ఉంటుంది అని ఇపుడు దాదాపు కన్ఫర్మ్ అయ్యిపోయింది.

దీనితో అయితే ఏక్షన్ అండ్ ప్రభాస్ లవర్స్ అయితే ఆ రోజుకి తమ టైం ని లాక్ చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రాన్ని అయితే ఇండియా సెన్సేషనల్ హిట్ చిత్రాలు “కేజీఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ భారీ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ లో మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.