బిగ్ అప్డేట్ : “గుంటూరు కారం” ట్రైలర్ ఆరోజునే 

ఈ కొత్త సంవత్సరం రావడంతోనే టాలీవుడ్ సినిమా దగ్గర అతి పెద్ద సినిమా పండుగ వాతావరణం కూడా స్టార్ట్ అయ్యింది. తెలుగు స్టేట్స్ లోనే కాకుండా తమిళ్ సినిమా దగ్గర కూడా పలు అవైటెడ్ భారీ చిత్రాలు రిలీజ్ కి రాబోతుండగా ఈ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ సినిమా “గుంటూరు కారం” కూడా రాబోతుంది.

కాగా ఈ చిత్రం పనులు ఇంకా కంప్లీట్ అవుతుండగా ఈ సినిమా ట్రైలర్ పై ఐతే బిగ్ అప్డేట్ ఇపుడు బయటకి వచ్చింది. ఈ సినిమా నిర్మాత వారసుడు నాగ వంశీ సోషల్ మీడియాలో జరిపిన ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ గుంటూరు కారం ట్రైలర్ ఈ జనవరి 6న రిలీజ్ చేస్తున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించారు.

దీనితో మహేష్ ఫ్యాన్స్ ఆ డేట్ ని లాక్ చేసుకున్నారు. కాగా ఇప్పుడు మహేష్ వెకేషన్ లో ఉండగా తిరిగి వచ్చాక ట్రైలర్ రిలీజ్ సహా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుంది అని ఇది వరకే టాక్ వచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు ట్రైలర్ పై అయితే క్లారిటీ వచ్చేసింది.

ఇంకా మిగతా అప్డేట్స్ సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మీనాక్షి చౌదరి ఇంకా శ్రీలీల లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే గ్రాండ్ గా ఈ చిత్రం ఈ జనవరి 12న రిలీజ్ కి తీసుకొస్తున్నారు.