టాలీవుడ్ సినిమా మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా నటించిన చిత్రం “భగవంత్ కేసరి” తో హ్యాట్రిక్ కొట్టి సీనియర్ హీరోస్ లో అయితే వరుస 100 కోట్ల గ్రాస్ ఉన్న ఏకైక హీరోగా నిలిచి సాలిడ్ రికార్డు సెట్ చేసాడు. ఇక బాలయ్య హీరోగా మాత్రమే కాకుండా ఒక ఓటిటి షో ని కూడా హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక దీనితో పాటుగా బాలయ్య పొలిటీషియన్ అని కూడా అందరికీ తెలిసిందే. కాకపోతే రాజకీయాల్లో ఫుల్ టైం లో బిజీగా ఉండరు కానీ సినిమాలు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడంతో పొలిటికల్ గా కనిపించేది తక్కువే. అయితే రీసెంట్ గా చంద్రబాబు అరెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బయట కనిపించిన బాలయ్య.. ఇప్పుడు తన పాలిటిక్స్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా రూమర్స్, గాసిప్పులు మొదలయ్యాయి.
కాగా లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే బాలయ్య పాలిటిక్స్ నుంచి బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నారని సినిమాలే చేయాలి అనుకుంటున్నారని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. కానీ అస్సలు ఇందులో నిజం లేదనే మరో టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఆల్రెడీ బాలయ్య తన 109వ సినిమా షూటింగ్ ని కూడా నిన్ననే స్టార్ట్ చేశారు.
అలాగే ఇంకో పక్క సమయం కూడా ఏపీలో ఎన్నికలకి సమీపిస్తోంది. మరి సినిమా రాజకీయాలు బాలన్స్ చేస్తారా లేక కంప్లీట్ గా బాలయ్య సినిమానే చేస్తారా అనేది చూడాలి. కాగా దర్శకుడు బాబీ తో చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ ని మేకర్స్ వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేస్తామని అంటున్నారు. అంటే ఈ లెక్కన బాలయ్య డేట్స్ ఎక్కువే ఇవ్వాల్సి ఉంది. మరి చూడాలి ఏమవుతుంది అనేది.