బాలయ్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అరవింద్… బాలయ్య అలాంటి హీరో అంటూ?

నందమూరి తారక రామారావు వారసులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా అడుగుపెట్టారు. కానీ వారందరిలో కేవలం బాలకృష్ణ మాత్రమే స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. గతేడాలో విడుదలైన అఖండ సినిమా ఇచ్చిన హిట్ తో బాలకృష్ణ మరింత ఉత్సాహంగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న వీరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

అంతేకాకుండా ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల అల్లు శిరీష్ హీరోగా నటించిన “ఊర్వశివో రాక్షసివో” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. అల్లు వారి హీరోల సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ ఇలా ముఖ్యఅతిథిగా హాజరుకావటం ఇదే మొదటిసారి. అన్ స్టాపబుల్ షో ద్వారా అల్లు కుటుంబం నందమూరి కుటుంబం మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడింది. అందువల్ల బాలకృష్ణ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరై సినిమా గురించి.. అల్లు శిరీష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇక ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రమ్మని అడిగిన వెంటనే బాలకృష్ణ ఓకే చెప్పాడని.. అలాగే బాలకృష్ణతో ఇలా అన్ స్టాపబుల్ షో ప్లాన్ చేస్తున్నామని చెప్పగానే అందుకు కూడా బాలకృష్ణ వెంటనే ఓకే చెప్పాడని అల్లు అరవింద్ ఈ సందర్భంగా వెల్లడించారు. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన బాలకృష్ణ ఇలా చాలా సింపుల్ గా , ముక్కుసూటిగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న బాలకృష్ణ కి అందరూ నిజమైన అభిమానులే అంటూ బాలకృష్ణ పై ప్రశంశలు కురిపించాడు. బాలకృష్ణ గురించి అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.