Roja: వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఈమె గతంలో మాట్లాడిన వ్యాఖ్యలను తాజాగా మరోసారి సమర్పించుకున్నారు. ఇటీవల ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా పవన్ కళ్యాణ్ గురించి మరోసారి మాట్లాడుతూ.. జగన్ కాలివేలు వెంట్రుక కూడా పవన్ కళ్యాణ్ పీకలేరు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
తాను చేసిన వ్యాఖ్యలలో తప్పేమీ లేదని రోజా తెలియజేశారు పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే 175 స్థానాలలో సింగిల్ గా పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ విసిరారు.జగన్ మోహన్ రెడ్డిని ఓడించేందుకే పవన్ కల్యాణ్ పనిచేశాడని రోజా తెలియజేశారు.మోడీ కాళ్లు పట్టుకుని, లోకేష్ కాళ్లుపట్టుకుని గెలిచాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ కార్యకర్తలకు కానీ తన కులానికి చెందిన నాయకుల కోసం కానీ పవన్ ఏమీ చేయలేదని అన్నారు. తెలుగు దేశం పార్టీని కాపాడేందుకే పవన్ కల్యాణ్ పనిచేస్తున్నాడని చెప్పారు. జనసేన నాయకులు టీడీపీ నాయకుల గురించి మాట్లాడితే వెంటనే సస్పెండ్ చేస్తున్నారని తెలిపారు.
ఇలా పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలిన జనసేన నాయకులను నేతలను కూడా తెలుగుదేశం పార్టీ కోసం పని చేయాలని వారికి ఆదేశాలను జారీ చేస్తున్నారే తప్ప పార్టీని నమ్ముకున్న వారికి పవన్ కళ్యాణ్ చేసింది ఏమీ లేదు అంటూ రోజా పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు పెద్దగా రాజకీయ కార్యకలాపాలలో కూడా ఈయన పాల్గొనడం లేదని తెలుస్తోంది.
