NTR and Dil Raju : తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ సినిమా తీయబోతున్న ఎన్టీఆర్, దిల్ రాజు….!

NTR and Dil Raju : డిస్ట్రిబ్యూటర్ గా ప్రయాణం మొదలు పెట్టి, నైజాం అగ్ర డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగి, దిల్ సినిమాతో నిర్మాతగా మారి ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు.టాలీవుడ్ లో దిల్ రాజు సినిమా తీస్తున్నాడు అంటే ఆ సినిమా కు మినిమమ్ గారెంటీ ఉంటుంది. ఏవో కొన్ని సినిమాలు మాత్రం ఆశించిన విజయలని అంతుకోలేకపోయాయి.

ఇలా దిల్ రాజు తీసిన సినిమాలలో డిజస్టర్ గా నిలిచినా సినిమాలలో ఎన్టీఆర్ హీరో గా నటించిన రామయ్య వాస్తవయ్య ఒకటి.9ఏళ్ల క్రితం ఎన్టీఆర్ తో దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. ఆ తరువాత ఎందుకో మరి దిల్ రాజు ఎన్టీఆర్ కాంబినేషన్ కుదరలేదు.ప్రస్తుతం దిల్ రాజు రామ్ చరణ్ తేజ్ తో rc#15 సినిమా నిర్మిస్తున్నారు. దిల్ రాజు రామ్ చరణ్ తో కూడా 9 ఏళ్ళ క్రితం ఎవడు సినిమా నిర్మించారు తరువాత ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ కుదిరింది. అలాగే ఎన్టీఆర్ తో కూడా ఇదే రూట్ లో సినిమా తీయాలని ఆలోచిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ ప్రడ్తుతం కొరటాల శివ దర్శకత్వం లో సినిమా చేయాల్సి వుంది. ఈ సినిమా తరువాత బుచ్చి బాబు దర్శకత్వం లో మరో సినిమా చేతబోతున్నట్లు వార్తలు వున్నాయ్. ఐతే ఇవి రెండు సినిమాలు తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా చేయాబైతున్నట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించబోతున్నట్లు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయ్.వచ్చే ఏడాది ఈ క్రేజీ కాంబినేషన్‌ను తెరపై చూసే ఛాన్స్ లేకపోలేదని భావిస్తున్నారు మూవీ లవర్స్.