యశ్‌ ‘టాక్సిస్‌’ చిత్రంలో అక్షయ్‌ ఒబెరాయ్‌!

యశ్‌ హీరోగా మళయాల దర్శకురాలు గీతూమోహన్‌ దాస్‌ ‘టాక్సిక్‌’ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఒబెరాయ్‌ భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ అక్షయ్‌ పోస్ట్‌ పెట్టారు. ఆయన్ని టీమ్‌లోకి ఆహ్వానిస్తూ మూవీ యూనిట్‌ పంపిన లెటర్‌ను షేర్‌ చేశారు.

‘విూలాంటి ప్రతిభావంతులైన నటులతో కలిసి పనిచేసేందుకు ‘టాక్సిక్‌’ టీమ్‌ ఆసక్తిగా ఉంది’ అంటూ అక్షయ్‌ను ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించింది మూవీ యూనిట్‌. ఈ చిత్రం ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు ఇందులోని నటీనటులు గురించి వెల్లడించలేదు. మొదటిసారి అక్షయ్‌ భాగమైనట్లు తెలుపుతూ పోస్ట్‌ చేయడంతో అభిమానులు సంబరపడుతున్నారు.

ఈ ఏడాదిలో అక్షయ్‌.. ‘టాక్సిక్‌’తో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. యశ్‌ నటిస్తోన్న 19వ చిత్రమిది. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌.. అన్నది ఉపశీర్షిక. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.’కేజీఎఫ్‌’ సిరీస్‌ విజయాల తర్వాత యశ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.