30రోజుల్లో ప్రేమించడం ఎలా?.. కలెక్షన్స్ తో షాక్ ఇచ్చిన ప్రదీప్

30 rojullo preminchatam ela movie review

బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వచ్చిన సినిమాలు చాలా వరకు మంచి ఓపెనింగ్స్ ను అందుకున్నాయి. ఆడియెన్స్ సినిమా కోసం ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన మొదటి సినిమా 30రోజుల్లో ప్రేమించడం ఎలా? శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మొత్తానికి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది.

సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ తోనే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. సినిమాకు పాట అందించిన క్రేజ్ కూడా బాగానే కలిసొచ్చింది. పైగా ప్రమోషన్స్ కూడా జనాల వరకు వెళ్లాయి. సినిమా మొదట రోజు ఆంద్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రూ.2.73కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందించినట్లు తెలుస్తోంది. ఇక షేర్స్ విషయానికి వస్తే రూ.1.69కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం.

శుక్రవారం ఓపెనింగ్స్ బావుండడంతో సినిమా తప్పకుండా శని ఆదివారాల్లో ప్రాఫిట్స్ లోకి వస్తుందని సమాచారం. ఇక ఈ సినిమాను GA2, UV క్రియేషన్స్ సంయుక్తంగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాయి. సినిమాకు మాస్ ఏరియాల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. కొన్ని ఏరియాల్లో అయితే హౌజ్ ఫుల్ బోర్డ్స్ కూడా దర్శనమిచ్చాయి. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 4కోట్ల వరకు ధర పలికినట్లు సమాచారం. మరి ప్రదీప్ సినిమా మొత్తంగా ఏ రేంజ్ లో లాభాలను అందిస్తుందో చూడాలి.