మ్యాడ్ స్క్వేర్ సినిమాలో కథ ఉండదట.. నిర్మాత నాగవంశీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారుగా!

2023 సంవత్సరంలో థియేటర్లలో విడుదలైన మ్యాడ్ మూవీ ఏ స్థాయిలో హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బడ్జెట్ తో పోల్చి చూస్తే 6 రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకోవడం ద్వారా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. మ్యాడ్ సినిమాలో కథ లేకపోయినా కథనం కొత్తగా ఉండటం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. నిర్మాత నాగవంశీ మ్యాడ్ స్క్వేర్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మ్యాడ్ స్క్వేర్ సినిమాలో కథ ఉండదని ఈ సినిమా గురించి మరీ ఎక్కువగా ఊహించ్ ఉకుని రావద్దని నాగవంశీ పేర్కొన్నారు. 2 గంటలు నవ్వుకోవడానికి మాత్రమే సినిమాకు రావాలని ఆయన చెప్పుకొచ్చారు. బీటెక్ చదివి బీటెక్ కు సంబంధించిన ఉద్యోగం చేయకూడదని ఫిక్స్ అయిన ముగ్గురు వెధవలు ఒక మంచోడిని వెధవను చేసే కథతో ఈ సినిమా తెరకెక్కిందని నాగవంశీ తెలిపారు.

హైదరాబాద్ లో చేయాల్సిన అరాచకాలు అన్నీ అయిపోయాయని కథను గోవాకు షిఫ్ట్ చేశామని ఆయన అన్నారు. అంతా ఫన్ అని మరోసారి క్లియర్ గా చెబుతున్నానని ఆయన తెలిపారు. ఈ సినిమాలో లాజిక్స్ ఉండవని కథలో అది మిస్ అయిందని ఈ విషయంలో డైరెక్టర్ ను నిర్మాతను విమర్శించవద్దని ఈ సినిమాలో కథ లేదని మేమే చెబుతున్నామని నాగవంశీ వెల్లడించారు.

మ్యాడ్ స్క్వేర్ టీజర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు రికార్డ్ స్థయ్లో వ్యూస్ వచ్చాయి. మ్యాడ్ స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తాయో చూడాల్సి ఉంది.