గుండె దగ్గర నొప్పిగా ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. ఈ తప్పులు అస్సలు చేయకూడదా?

మన దేశంలో ప్రతి సంవత్సరం గుండెపోటు సమస్య వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. గుండెపోటు వచ్చిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. హార్ట్ స్ట్రోక్ వస్తే మాత్రం మూడు నెలల పాటు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. గుండెపోటు వచ్చిన మూడు నెలల వరకు ఆరోగ్యం విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం అయితే ఉంది. ప్రతిరోజూ 5000 నుంచి 10000 అడుగులు వేసేవాళ్లకు గుండెనొప్పి వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయని సమాచారం. ఒకప్పుడు పురుషులనే ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలు వేధించేవి. అయితే ఇప్పుడు మాత్రం పురుషులతో పాటు మహిళలను సైతం గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి.

ఛాతీలో తరచూ విపరీతమైన నొప్పి వస్తుంటే వైద్యులను సంప్రదించాలి. ఎడమ చేయి వైపు కానీ రెండు చేతుల్లో కానీ నొప్పి వస్తే ఆ లక్షణం కూడా గుండెపోటు లక్షణం అని గుర్తుంచుకోవాలి. ఛాతిలో నొప్పి, చేతులు, దవడ భాగంలో నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు సైతం గుండెపోటుకు సంకేతాలు కాగా హైబీపీ, డయాబెటిస్ ఉంటే గుండె సమస్యలు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి.

ఊబకాయం, సరైన జీవన విధానాన్ని అనుసరించకపోవడం వల్ల కూడా గుండెపోటు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు తగినంత వ్యాయామం చేయడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వచ్చి అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు.