కిడ్నీ సమస్యలను ఎలా గుర్తించాలో తెలుసా.. ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఆరోగ్య సమస్యల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కొన్నిసార్లు ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే కిడ్నీ సమస్యలకు సంబంధించి కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. కొన్ని లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలి.

రాత్రి సమయంలో తరచుగా యూరిన్ కు వెళుతుంటే కిడ్నీ సమస్యలు అయ్యే అవకాశాలు ఉంటాయి. మూత్రం రంగులో ఏవైనా మార్పులు ఉన్నా ఆ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సంకేతం అని చెప్పవచ్చు. కిడ్నీలు సరిగ్గా పని చేయని పక్షంలో ఎక్కువగా మూత్రం రంగు మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇన్ఫెక్షన్స్, కిడ్నీల్లో రాళ్ళ సమస్య వల్ల కొన్నిసార్లు కిడ్నీ సంబంధిత సమస్యలు వేధిస్తాయి.

మూత్రంలో నురగ కనిపిస్తున్నా అందుకు కిడ్నీ సమస్యలు కారణమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లక్షణం కనిపించిన వెంటనే అప్రమత్తం కావాలి. ప్రోటీన్ విసర్జన జరిగిన సమయంలో మాత్రమే మూత్రం నుంచి నురగ వస్తుంది. నిద్రలేమి కూడా కిడ్నీ సంబంధిత సమస్యలకు ఒక లక్షణమని చెప్పవచ్చు. కిడ్నీ సమస్యలతో బాధ పడేవాళ్లలో మెలటోనిన్ స్థాయిలు తగ్గుతాయి.

తరచూ ఊపిరి సంబంధిత సమస్యలు వేధిస్తున్నా అందుకు కిడ్నీ సమస్యలు కారణమవుతాయని చెప్పవచ్చు. చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు వేధిస్తుంటే కిడ్నీల పనితీరు సరిగ్గా లేదని చెప్పవచ్చు. మూత్రంలో రక్తం వచ్చినా, ఇతర మూత్ర సంబంధిత లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుల సలహాలు తీసుకుని వైద్య చికిత్స చేయించుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.