మనలో చాలామంది మాంసాహారానికి బదులుగా శాఖాహారం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే మాంసాహారం స్థాయిలో శక్తినిచ్చే శాఖాహారాలు ఉన్నాయి. కొన్ని శాఖాహారాలు శక్తితో పాటు శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందిస్తాయి. బొబ్బర్లు, రాజ్మా, పెసలు, మినప్పప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రోజూ కాల్చిన శనగలు తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయి.
పుట్టగొడుగులు తీసుకోవడం ద్వారా శాఖాహారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. పుట్టగొడుగులు తీసుకుంటే ప్రోటీన్, ఫైబర్ లభిస్తాయని కచ్చితంగా చెప్పవచ్చు. జున్ను తీసుకోవడం ద్వారా హెల్త్ కు మేలు చేకూరుతుంది. జున్ను తీసుకోవడం ద్వారా మాంసాహారంను మించిన శక్తి లభిస్తుందని చెప్పవచ్చు. ప్రోటీన్లతో నిండిన ఆహారం తీసుకోవడం ద్వారా లభం కలుగుతుంది.
పనస పండ్లు తీసుకోవడం ద్వారా కూడా శరీరానికి మేలు జరుగుతుంది. శరీరానికి అమితమైన శక్తిని అందించే విషయంలో ఈ పండ్లు ఎంతగానో తోడ్పడతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. పనసకాయతో వండిన వంటలు శక్తిని అందించడంలో ఎంతగానో సహాయపడతాయి. మాంసం తినలేని వాళ్లకు ఈ ఆహారాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
శాఖాహారం తినే వాళ్లలో కొందరు గుడ్డును తీసుకోవడానికి ఇష్టపడేవాళ్లు గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. శాఖాహారం తినడం వల్ల దీర్ఘకాలంలో భారీ స్థాయిలో ప్రయోజనాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. శాఖాహారం తినేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.