యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ట్రేడ్ లలో అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 243 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు 82 ఉండగా ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలు కూడా 82 ఉన్నాయి. వెల్డర్ ఉద్యోగ ఖాళీలు 40 ఉండగా టర్నర్/ మెషినిస్ట్ ఉద్యోగ ఖాళీలు 12 ఉన్నాయి.
మెకానిక్(డీజిల్/ ఎంవీ) ఉద్యోగ ఖాళీలు 12 ఉండగా ప్లంబర్ ఉద్యోగ ఖాళీలు 5, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి. జాదుగూడ యూనిట్- 102, నర్వాపహార్ యూనిట్- 51, తురమ్దిహ్ యూనిట్- 90 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అక్టోబర్ 13, 2023 నాటికి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2023 సంవత్సరం నవంబర్ 12వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుండగా ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సులువుగా ఎంపికయ్యే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.