ప్రస్తుత కాలంలో గర్భంతో ఉన్న మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఏ తప్పు చేసినా తల్లి ప్రాణాలతో పాటు బిడ్డ ప్రాణాలకు సైతం అపాయం కలుగుతుంది. ప్రధానంగా ఉద్యోగం చేసే మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గర్భంతో ఉన్న సరిగ్గా తినకపోవడం, ఒత్తిడి, ఆందోళన ఎదుర్కొంటే పిల్లలపై ఆ ప్రభావం పడుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.
గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. పండ్లు, పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ మహిళలకు కొన్ని పండ్లు, కూరగాయలు మంచివి కాదు. అలాంటి వాటికి మాత్రం వీలైనంత దూరంగా ఉంటే మంచిది. చిక్కుళ్ళు, మొలకలు, పాలు, గుడ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా మహిళలకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే ఛాన్స్ అయితే ఉంటుంది.
నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు సిప్ చేస్తూ తీసుకోవడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫోలెట్, ఐరన్, క్యాల్షియం రిచ్ పుడ్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కడుపులోని బిడ్డకు రక్త ప్రసరణ మెరుగ్గా జరగాలంటే కనీసం 10 గంటల నిద్ర ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే.
సరైన నిద్ర లేకపోతే నిరాశ, జస్టేషనల్ డయాబెటిస్, నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం, పిండం అభివృద్ధిలో బలహీనత లాంటి సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. భారీ వ్యాయామం, శ్రమతో కూడిన పని, ట్రైనింగ్‌కు గర్భంతో ఉన్న మహిళలు దూరంగా ఉండాలి.