మోకాళ్ల మధ్య జిగురు పెరగాలా.. ఈ ఆహారాలు తింటే మాత్రం సమస్యలు దూరం!

ఈ మధ్య కాలంలో చాలామంది చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఈ సమస్యకు ఒక కారణమని చెప్పవచ్చు. కీళ్ల మధ్య గుజ్జు, జిగురు తగ్గుతుందంటే కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రతిరోజూ గంట సమయం పాటు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

వాకింగ్, స్విమ్మింగ్ చేయడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పాలు, గుడ్లు తీసుకోవడంతో పాటు క్యాల్షియం అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. బెండకాయను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరంలో సైనోవియల్ ఫ్లూయిడ్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ప్రతిరోజూ కనీసం 15 నిమిషాల పాటు ఎండలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్ డి వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. శరీరం క్యాల్షియంను శోషించుకోవడం ద్వారా కూడా ఎముకల ఆరోగ్యం మెరుగుపడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మోకాళ్ళలో జిగురు అరిగిపోవడం వలన ఎముకలు రాపిడికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది.

రెడ్ క్యాప్సికం, కాలె, ఉల్లి, వెల్లుల్లి, అల్లం, బీన్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువగా ఈ ఆహారాలను తీసుకోని వాళ్లు డైట్ లో వీటిని భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎముకలు, కీళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయని చెప్పవచ్చు.