సాధారణంగా వర్షాకాలంలో వ్యాధుల విజృంభణ మామూలుగా ఉండదనే సంగతి తెలిసిందే. వర్షాకాలంలో ఎక్కువమందిని వేధించే వ్యాధులలో డెంగీ జ్వరం ఒకటి కాగా ఎవరైతే ఈ వ్యాధితో బాధ పడతారో వాళ్లను ప్లేట్‌లెట్లు తగ్గటం, రక్తం చిక్కపడటం, రక్తస్రావం వంటి సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆడ ఈజిప్టై దోమ కుట్టటం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
శరీరంలోని ప్లేట్‌లెట్‌లను దెబ్బ తినేలా చేయడానికి ఈ వ్యాధి కారణమవుతుంది. డెంగ్యూ వచ్చినప్పుడు, అది ప్లేట్‌లెట్‌లను ఉత్పత్తి చేసే ఎముక మజ్జను సైతం అణచివేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గితే ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చర్మం మీద ఎర్రటి దద్దు. దురదతో పాటు దద్దుర్లు ఛాతీ మీద మొదలై చేతులు, కాళ్లు, ముఖానికి వ్యాపిస్తాయి.
చిగుళ్లలో రక్తస్రావం సమస్య కూడా డెంగీతో బాధ పడేవాళ్లను వేధిస్తుంది. మూత్రంలో రక్తం, వాంతుల నుంచి రక్తం రావడం, మలంలో రక్తం రావడం వంటి లక్షణాలు డెంగీతో బాధ పడేవారిని వేధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. విటమిన్ బి12, ఐరన్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ కె సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా డెంగీ సమస్య దూరమవుతుందని చెప్పవచ్చు.
పాలు, పాల ఉత్పత్తులను తీసుకుంటే ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచుకోవచ్చు. గుమ్మడికాయ, టర్నిప్‌లు, ఎరుపు, ఆకుపచ్చ క్యాప్సికమ్, టమాటాలు, బీట్‌రూట్, తీసుకుంటే కూడా ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను మీ ఆహారంలో చేర్చుకుంటే కూడా ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండగా వీటిని ఆహారంలో చేర్చుకుంటే మంచిది.