మనలో చాలామంది కాల్షియం లోపంతో బాధ పడుతూ ఉంటారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, పోషకాలు లేని ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలామంది ఈ సమస్యతో బాధ పడుతూ ఉంటారు. అయితే కొన్ని ఆహారాలు కాల్షియంను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా కాల్షియం సమస్యకు సులువుగానే చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
కాల్షియం లోపం సమస్యతో బాధ పడుతున్న వాళ్లు సోయా పాలను తీసుకుంటే మంచిది. సోయా పాలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ డి, కాల్షియం లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. చియా గింజలు సైతం ఆరోగ్యపరమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి. చియా గింజలలో కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్ ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి.
ఒక కప్పు బాదంపప్పును తీసుకోవడం వల్ల మన శరీరానికి 385 మిల్లీ గ్రాముల కాల్షియం లభించే ఛాన్స్ ఉంటుంది. బ్రోకలీ కూడా కాల్షియం రిచ్ ఫుడ్స్ లో ఒకటి కాగా బ్రోకలీ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు. సోయాబీన్స్ తో తయారు చేసిన టోపులో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కాలే ఆకులను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కేలరీలు, కాల్షియం లభించే అవకాశం అయితే ఉంటుంది.
నువ్వులను ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా కూడా శరీరానికి అవసరమైన కాల్షియం సులువుగానే లభిస్తుందని చెప్పవచ్చు. సన్ ఫ్లవర్ సీడ్స్ తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి అవసరమైన కాల్షియం సులువుగానే లభించే అవకాశాలు ఉంటాయి. కాల్షియం లోపం గురించి మరీ ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.